చాక్లెట్స్‌ తినడం వల్ల బరువు తగ్గొచ్చా..? వైద్యులేమంటున్నారంటే..

-

చాక్లెట్స్‌ ఇష్టపడని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఏజ్‌తో సంబంధం లేకుండా అందరూ చాక్లెట్‌ను ఎగబడి తింటారు. ఇవి తింటే పళ్లు పుచ్చిపోతాయి అని తెలుసు కూడా లాగించేస్తుంటాం.. అయితే చాక్లెట్ల వల్ల నష్టాలను కాసేపు పక్కన పెడితే..లాభాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.. ఇది మానసిక స్థితిని బాగు చేస్తుందని అందరికీ తెలుసు.. తలనొప్పిని తగ్గిస్తుంది. వీటితో పాటు చాక్లెట్స్‌ కొవ్వును కూడా కరిగిస్తాయట.. బరువు తగ్గాలనుకునే వారు చాక్లెట్స్‌ తినొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

- Advertisement -

డార్క్ చాక్లెట్స్‌ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందట.. అదేవిధంగా జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ శరీరంలో ధమనులు, సిరల పనితీరును మెరుగుపరస్తాయి.. హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్‌ ఏది ఎంత ఉండాలి..?

మీ మొత్తం కొలెస్ట్రాల్ 200-239 mg/dL మధ్య ఉంటే అది కొంచెం ఎక్కువగా పరిగణించబడుతుంది. 240 mg/dL కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువగా పరిగణించబడుతుంది. మీ LDL (చెడు) కొలెస్ట్రాల్ 130 -159 mg/dL మధ్య ఉంటే, అది కొంచెం ఎక్కువగా పరిగణించబడుతుంది. ఇది 160 mg/dL కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువగా పరిగణించబడుతుంది. మీ HDL( మంచి) కొలెస్ట్రాల్ 40 mg/dL కంటే తక్కువగా ఉంటే అది చెడుగా పరిగణించబడుతుంది.

డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ వంటి కోకో డెరివేటివ్‌లలో 70% కంటే ఎక్కువ పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచడానికి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కోకో పౌడర్‌ను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కోకో పౌడర్‌లో పాలీఫెనాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి..ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...