`టీ` ఇలా తాగితే క్యాన్స‌ర్ వ‌స్తుందా.. నిజ‌మెంతా..!

-

మార్నింగ్ నిద్ర లేవ‌గానే వేడి వేడిగా ఓ క‌ప్పు టీ తాగ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు. టీ తాగ‌డం వ‌ల్ల ఎక్కడలేని ఉత్సాహం, స్ట్రెస్ నుంచి రిలీప్ వ‌స్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఎక్కువ వేడిగా ఉన్న టీలు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు గోరువెచ్చ‌గా ఉంటే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ఎక్కువ వేడిగా ఉన్న టీలు తాగ‌డం వల్ల కాన్సర్ వస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా 60 డిగ్రీల కంటే ఎక్కువగా వేడి ఉన్న టీ, కాఫీలు తాగడం వల్ల అన్నవాహిక కాన్సర్ ( ఓసోఫాగియల్ క్యాన్సర్) వచ్చే అవకాశముందని జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌’లో ప్రచురించిన ఒక పరిశోధనా ప్ర‌కారం తెలుస్తోంది.

ఈ ఆధ్యాయ‌నంలో.. ఇరాన్‌లోని గోలెస్టాన్‌లో 40 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 50,045 మందిని సగటున 10.1 సంవత్సరాల వరకు పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధన 2004-2017 మధ్య జరిగింది. పరిశీలనకు సహకరించిన వారిని వారు తాగిన టీ ఉష్ణోగ్రతను బట్టి రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఈ క్ర‌మంలోనే 60°సి కంటే తక్కువ తాగేవారితో పోల్చితే 60°సి, అంతకంటే ఎక్కువ తాగేవారికి ఓసోఫాగియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 90 శాతం ఎక్కువ అని వెల్ల‌డైంది. ఈ ప‌రిశోధ‌న‌లో దాదాపు 317 మందికి ఒసోఫాగస్ క్యాన్సర్ వచ్చింది.

వాస్త‌వానికి మన గొంతు నుండి పొట్ట వరకు ఓ గొట్టం ఉంటుంది. దీనికి వచ్చే వ్యాధినే ఒసోఫాగస్ క్యాన్సర్ అంటారు. వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల సున్నితంగా ఉండే ఆ ప్రభావం గొంతునాళంపై పడి మంట, పుండ్లు ఏర్ప‌డి ఈ క్యాన్స‌ర్ రావ‌డానికి కార‌ణం అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. అయితే వీరు పూర్తిగా టీ తాగ‌వ‌ద్ద‌ని చెప్ప‌డం లేదు. అధిక వేడి ఉన్న టీ, కాపీ మ‌రియు ఇత‌ర లిక్విడ్స్ తాగ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news