కొలోరెక్టల్ క్యాన్సర్.. కారణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు..

-

మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అంతకుముందు పెద్దగా పట్టించుకోని వారు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. ఐతే ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటున్న అనారోగ్యం కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ మరణాల్లో ఎక్కువ భాగం క్యాన్సర్ బారిన పడిన వారే ఉంటున్నారు. ప్రపంచంలో అనారోగ్యం కారణంగా మరణిస్తున్న వారిలో క్యాన్సర్ కారణంగా మరణించే వారు రెండవ ప్లేస్ లో ఉన్నారు.

2018లో క్యాన్సర్ కారణం 9.8మిలియబన్ల మంది మరణించారు. అందులో కోలోరెక్టల్ క్యాన్సర్ ద్వారా మరణించినవారు 1.8మిలియన్ల మంది ఉన్నారు. అంటే ఈ క్యాన్సర్ కారణంగా మరణించే వారు చాలా ఎక్కువ. కోలోరెక్టర్ క్యాన్సర్ అనేది పేద్దప్రేగులో వచ్చే క్యాన్సర్. పెద్ద పేగు నుండి మలద్వారం వరకు ఈ క్యాన్సర్ వ్యాపిస్తుంది. ఆ భాగల్లో గడ్డలుగా మారి అది క్యాన్సర్ గా మారుతుంది. ఐతే ఈ క్యాన్సర్ ని తొందరగా గుర్తిస్తే దాన్నుండి బయటపడడం పెద్ద కష్టమేమీ కాదు.

కొన్ని కొన్ని సార్లు సర్జరీ ద్వారా ఈ క్యాన్సర్ కణాలని తొలగించవచ్చు. పరిస్థితిని బట్టి రేడియోథెరపీ, కీమోథెరపీ వంటి వాటికి వెళ్ళవచ్చు. ఈ కోలోరెక్టర్ క్యాన్సర్ రావడానికి చాలా కారణాలున్నాయి. ఆల్కహాల్ సేవించడం, పొగతాగడం, సరైన జీవిత చక్రం లేకపోవడం, ఇన్ ఫ్లమేటరీ బోవెల్ సిండ్రమ్ వంటి వ్యాధులు ఉండడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ క్యాన్సర్ పురుషుల్లోనే ఎక్కువగా వస్తుంది. అదీగాక నలభై దాటిన వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇలాంటి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే,

ఆరోగ్యకరమైన జీవితాన్ని పాటించాలి. మద్యం, పొగ వంటి వాటికి దూరంగా ఉండాలి. అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తే భవిష్యత్తుల్లో పెద్ద పెద్ద వాటి నుండి బయటపడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news