పిల్లల ఆరోగ్యం, పొషకాహారం వంటి విషయాల్లో తల్లిదండ్రులకు ఒకరకమైన టెన్షన్ ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత ఆడుకోవడం బాగా తగ్గింది. మొబైల్ చేతిలో పట్టుకుని గంటల తరబడి కళ్ళని ఎలక్ట్రానిక్ తెరలకు అప్పగించేస్తున్నారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రులే అని చెప్పాలి. పిల్లల్ని ఆటల్లో నిమగ్నం చేసేలా ప్రేరేపించకపోవడంతో శారీరకంగా ఎలాంటి శ్రమ లేకపోవడం వారిలో అనేక అనర్థాలని కలగజేస్తుంది. ఆ అనర్థాల్లో మలబద్దకం కూడా ఒకటి.చిన్నపిల్లల్లో మలబద్దకం సమస్య చాలా సాధారణమైనదిగా చాలామంది భావిస్తారు.
కానీ అది సాధారణమైన విషయం కానే కాదు. అసలు పిల్లల్లో మలబద్దకం ఏర్పడడానికి కారణాలేంటనేది చూస్తే,
శారీరక శ్రమ లేకపోవడం, ఆటలు ఆడకపోవడం
కావాల్సినన్ని నీళ్ళు తీసుకోకపోవడం
జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం
రాత్రి ఎక్కువ సేపు మేల్కోని ఉండడం
రాత్రి ఆలస్యంగా తినడం
క్రమం తప్పిన సమయాల్లో ఆహారం తీసుకోవడం
నిద్ర సరిగ్గా ఉండకపోవడం
జీవక్రియ పనితీరు సరిగ్గా లేకపోవడం
ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం
మలబద్దకాన్ని తగ్గించే పద్దతులు
పొద్దున్న లేవగానే గోరు వెచ్చని నీళ్ళని వారికి అందించాలి.
4-5ఎండు ద్రాక్ష ఉదయం లేవగానే తినిపించాలి. అవి రాత్రిపూట నానబెట్టినవై ఉండాలి.
రాత్రి పడుకునేటపుడు గోరు వెచ్చని ఆవుపాలలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి వారికి అందించాలి.
వండని పదార్థాలు వారికి ఇవ్వవద్దు. ఉడకబెట్టిన ఆహారాలనే ఇవ్వండి.
చక్కెర గల ఆహారాలు, ప్యాకేజీలో ఉన్న ఆహారాలను అస్సలు ఇవ్వవద్దు.
ఇంకా శారీరక వ్యాయామంతో పాటు ఆటలు ఆడించాలి. నడక, పరుగు మొదలైనవి వారితో చేయిస్తే బాగుంటుంది.