వర్షాకాలంలో వచ్చే అలర్జీలను ఇలా ఇంటి చిట్కాలతో నయం చేసుకోండి..!

-

వర్షాలు మొదలయ్యాయి. ఆంధ్రాలో అయితే వర్షాలు పడ్డా ఇంకా ఎండలు గట్టిగానే కొడుతున్నాయి కానీ, తెలంగాణలో వాతావరణం చల్లబడింది. పూర్తిగా కూల్‌ అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే నాలుగు రోజుల నుంచి మస్త్‌ కూల్‌ ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. ఇక ఈ సీజన్‌లో వర్షం నీటిలో తడిస్తే దగ్గు, జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్స్‌ వస్తుంటాయి. హోం రెమెడీన్‌ వినియోగించడం వల్ల సులభంగా స్కిన్‌ అలర్జీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి హోం రెమెడీస్‌ను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వానా కాలంలో అలర్జీ సమస్య రాకుండా ఉండాలంటే శుభ్రమైన కాటన్ దుస్తులను ధరించండం చాలా మంచిదని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఉతికి దుస్తువులను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. చెమట పట్టిన వస్త్రాలును ధరించడం వల్ల బ్యాక్టీరియా చర్మంపై చేరి అలెర్జీ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఇప్పటికే చర్మంపై అలెర్జీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రభావిత ప్రాంతాల్లో కొబ్బరి నూనెను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల అలర్జీల వల్ల వచ్చే దురదను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

అలర్జీ కారణంగా వచ్చే దురదను టీ ట్రీ ఆయిల్‌ వాడటం వల్ల ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దురద గల ప్రదేశంలో ఈ నూనెను అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా చర్మాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

అలెర్జీ వచ్చిన ప్రాంతాల్లో యాపిల్ సైడర్ వెనిగర్‌ను అప్లై చేయడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది చర్మంపై మంట, దురద ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు ఒక కప్పు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ మిక్స్‌ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడాతో కూడా..!

బేకింగ్ సోడా అప్లై చేయడం వల్ల కూడా సులభంగా చర్మంపై అలెర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు దురదను కూడా తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. దీని కోసం ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకుని ఒక కప్పు నీటిలో కలుపుకుని అలెర్జీ ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల త్వరలోనే అలెర్జీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version