చెప్పులేసుకోకుండా నడిస్తే ఎన్నో ప్రయోజనాలని పొందొచ్చు తెలుసా..?

-

వాకింగ్ చేయడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేది అందరికీ తెలుసు. అయితే చెప్పులు వేసుకోకుండా వట్టి కాళ్ళ మీద నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే దాని గురించి ఇప్పుడే చూసేయండి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

వట్టి కాళ్లతో నడవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. కనుక అప్పుడప్పుడు వట్టి కళ్ళతో నడవండి.

యాంగ్జైటీ తగ్గుతుంది:

యాంగ్జైటీ ని తగ్గించుకోవడానికి వట్టి కాళ్లతో నడిచి చూడండి. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నూటికి నూరు శాతం నిజం. మీరు వట్టి కాళ్ళతో నడిచి నేచర్ పట్ల కాన్సన్ట్రేషన్ చేయండి. దీనితో డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది.

కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది:

ఇలా వట్టి కాళ్ళతో నడవడం వల్ల కంటి చూపు కూడా బాగుంటుంది. కాబట్టి అప్పుడప్పుడు అయినా సరే ఇలా నడిచి చూడండి.

మంచి నిద్ర పొందొచ్చు:

మంచి నిద్ర పొందడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది. అలానే రాత్రి మంచి నిద్ర పట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

క్రానిక్ పెయిన్ తగ్గుతుంది:

రీసెర్చ్ ప్రకారం క్రోనిక్ పెయిన్ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడప్పుడు మీరు వట్టి కాళ్లతో నడిచి ఇన్ని ప్రయోజనాలు పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news