దోమలు కొంతమందిని మాత్రమే ఎక్కువ కుడుతాయి.. దానికి కారణం..మన నుంచి వాసన వాటిని బాగా యాట్రాక్ట్ చేస్తుందని మనకు తెలుసు.. కానీ దోమలుకు ఇంకా చాలా లెక్కలు ఉంటాయట.. కొన్ని కలర్స్ అంటే వాటికి ఇష్టమట.. ఒకవేళ మీరు ఆ కలర్ వేసుకుంటే.. దోమలు ఎట్రాక్ట్ అయి వచ్చి కుట్టిపెడతాయి.. భలే క్రేజీగా ఉంది కదూ.. ఇంతకీ దోమలకు ఉన్న లెక్కేందో చూద్దామా..!
నలుపు రంగు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ముదురు చర్మం రంగు లేదా ముదురు రంగు దుస్తుల వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయట.. ఇది కాకుండా, దోమలు మన శరీరం నుండి ఎక్కువ వేడిని చూస్తే, అవి మన వైపు ఎక్కువగా వస్తాయి.
ఇద్దరు పక్కపక్కనే కుర్చున్నప్పుడు ఒకరికి దోమలు కుడుతున్నాయంటే.. ఇంకొకరికి కొన్నిసార్లు అసలు దోమలు కుట్టినట్లు ఉండదు..దీని అర్థం..ఒకరి రక్తం దోమకు రుచిగా ఉంటే మరొకరి రక్తం దోమలకు నచ్చదు..కార్బన్ డయాక్సైడ్. హెల్త్‌లైన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, మనమందరం కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాం. దోమలు ఈ వాయువును సులభంగా గుర్తిస్తాయి. ఒక వ్యక్తి మరింత చురుకుగా ఉన్నప్పుడు, విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మొత్తం కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, దోమలు తమ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నారని అర్థం చేసుకుంటాయి.
ఇంకో కారణం మానవ శరీర వాసన దోమలను ఎక్కువగా ఆకర్షిస్తే మరికొందరికి తక్కువగా ఉంటుంది. ఇవి దోమలను ఆకర్షిస్తాయి. వీటిలో లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా ఉన్నాయి. 2011 పరిశోధన ప్రకారం, చర్మంపై ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటే, అప్పుడు దోమలు శరీరానికి తక్కువగా ఆకర్షితులవుతాయి.
2002 సంవత్సరంలో జరిగిన ఒక పరిశోధనలో కూడా దోమలు ఎక్కువగా బీర్ తాగే వారి పట్ల ఆకర్షితులవుతాయని తేలింది. గర్భిణీ స్త్రీల శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయి.
ఇన్ని లెక్కలు ఉంటాయనమాట దోమలకు.. బీర్ తాగేవాళ్లు జర జాగ్రత్తు.. అసలే మద్యం హెల్త్‌కు మంచిది కాదు.. అందులో మళ్లీ ఈ దోమలతో కుట్టించుకోవడం ఇంకా మంచిది కాదు..!