ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఎన్ని నష్టాల్లో తెలుసా..?

చాలామంది ఎక్కువ సేపు నిద్రపోరు. ఫోన్ టీవీ వంటి వాటికి ఎడిక్ట్ అయిపోవడం వలన చాలా తక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు అయితే నిజానికి మంచి నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది కచ్చితంగా రోజు ఎనిమిది గంటల వరకు నిద్రపోవడానికి చూసుకోవాలి. అయితే ఐదు కంటే తక్కువసేపు నిద్రపోవడం వలన కొన్ని రకాల సమస్యలు కలుగుతాయి ఐదు గంటల కంటే తక్కువ సేపు నిద్రపోవడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఐదు గంటలకంటే తక్కువసేపు నిద్రపోతే కొన్ని రకాల సమస్యలు తప్పవు ఐదు గంటలకంటే తక్కువసేపు నిద్రపోతే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అన్నిటినీ బాగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయితే నిద్ర తక్కువగా ఉండటం వలన జ్ఞాపకశక్తి తగ్గుతుంది. నిద్ర ఎక్కువసేపు లేకపోయినట్లయితే మూడ్ స్వింగ్స్ కూడా కలుగుతాయి కాబట్టి సరిగ్గా రోజు నిద్రపోయేటట్టు చూసుకోండి,

డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడి వంటివి కూడా నిద్ర సరిగా లేకపోవడం వలన కలుగుతాయి రోగ నిరోధక శక్తి కూడా నిద్ర సరిగ్గా లేకపోవడం వలన తగ్గుతుంది. నిద్ర సరిగా లేకపోతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రోజూ సరిపడ నిద్రని పొందేలా చూసుకోండి. నిద్ర సరిగ్గా లేకపోయినట్లయితే డయాబెటిస్ ప్రమాదం కూడా ఉంది. ఐదు గంటలకంటే తక్కువసేపు నిద్రపోతే డయాబెటిస్ రావచ్చు రోజు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. చూశారు కదా నిద్ర వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో.. కాబట్టి ఫుల్లుగా నిద్రపోండి ఆరోగ్యంగా ఉండండి.