బాడీలో విటమిన్ b12 లోపిస్తే బ్రెయిన్ కే ప్రమాదం తెలుసా..!

-

హెల్తీ ఫుడ్ అంటే.. పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు మాత్రమే తీసుకుంటే సరిపోదు.. వీటితోపాటు.. విటమిన్లు, లవణాలు ఇంకా.. సూక్ష్మపోషకాలు కూడా బాడీకీ చాలా అవసరం..ఇవి అందకపోతేనే బాడీలో విటమిన్ b12 లోపం ఏర్పడుతుంది. ఆ పడితే పడనీయండిలే అనుకుంటారేమో.. మన దేశంలో చాలామంది.. ప్రోటీన్ లోపం, విటమిన్ b12లోపంతో బాధపడుతున్నారు. ప్రోటీన్ లోపించిందని వారికి కూడా తెలియదు.కానీ విటమిన్ b12 అలా కాదు.. తక్కువైతే.. సమస్యలు ఎక్కువవుతాయి. మరీ ఈరోజుం మనం విటమిన్ b12 లోపిస్తే.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వీటివల్ల ఆరోగ్యానికి ఏ విధంగా హాని జరుగుతుందో చూద్దామా..!

Vitamin B12 డెఫీషియన్సీ లక్షణాలు..

Vitamin B12 Deficiency symptoms మెయిన్ గా అనీమియా తోనే మొదలవుతాయి. కాళ్లు మొద్దుబారినట్లు అవడం, కాళ్లలో శక్తి లేకపోవడం, నరాల పరంగా కూడా సరైన ట్రీట్మెంట్ తో సరైన టైంలో ఇవ్వకపోతే ఒక వ్యాధిలాగా ఇది ప్రభలోచ్చు.
వెజిటేరియన్స్ లో చాలా కామన్ గా ప్రబలే డెఫిసియెన్సీ B12. ముఖ్యంగా వేగాన్స్ అంటారు. అంటే వాళ్ళు ఎగ్ కూడా తీసుకోరు. ఎలాంటి నాన్వెజ్ తీసుకోరు. వీళ్ళలో B12 Deficiency ఉండే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. విటమిన్ 12 మాంసాహారంలో మాత్రమే ఉంటుంది కాబట్టి.. నాన్ వెజ్ తినని వాళ్లు ఎక్కువగా దీని భారిన పడతారు.
నీరసం, నిస్సత్తువ, బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగ్గా లేకపోవడం, వణుకు, అనియంత్రిత కదలికలు ఇలా అనేక కదలికలు కనిపిస్తుంటాయి. మన వొంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు Vitamin B12 లోపం ఉందేమోనని అనుమానించాలి.
పిల్లల్లో బాగా అలసట కనిపించిన, రక్తహీనత కనిపించిన, మతి మెరుపు, జ్ఞాపకశక్తి లోపాలు కనిపించినా కూడా Vitamin B12 లోపం ఉండొచ్చు.. ఒకసారి టెస్ట్ చేయించాలి.
చాలా ఏళ్ళ తరబడి యాంటాసిడ్ అంటే యాసిడ్ సప్రెసివ్ మెడిసిన్ తీసుకునే వాళ్లలో కూడా B12 Deficiency వస్తుంది. ఆల్కహాలిక్స్ లో కూడా డెఫిసియెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జీర్ణించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. జీర్ణశాక అబ్జార్వ్ చేసుకునే దానికి అంత ఐడియల్ గా ఉండదు.

విటమిన్ b12 వల్ల వచ్చే సమస్యలు..

Vitamin B12 బి విటమిన్ గ్రూప్ లో ప్రధానమైనది ఇదే. మెదడు, నాడి వ్యవస్థ చక్కగా పనిచేయడానికి కారణమయ్యే విటమిన్ ఇది. అంతకంటే ముఖ్యంగా రక్తం తయారీలో కూడా Vitamin B12 చాలా ఉపయోగం. అందుకే Vitamin B12 లోపం అనేది శరీరంలో మెదడుకు రక్తానికి సంబందించిన సమస్యలకు దారితీస్తుంది.
మన శరీరానికి తగినంత Vitamin B12 లభించనప్పుడు జ్ఞాపకశక్తి తగ్గుముఖం పడుతుంది.
అల్జీమర్స్ వంటి మతిమరుపు సమస్యలు మొదలవుతాయి.
కండరాలను నిర్వీర్యం చేసే మల్టిపుల్ క్లిరోసిస్, డిప్రెషన్, ఆందోళనలు వంటి మానసిక చికాకులు, హార్టిజం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, సంతాన లోపాలు ఇలా చాలా సమస్యలకు Vitamin B12 లోపం కారణం అవుతుంది.
RBC సైజ్ గాని, నరాలలో గాని, నెర్వ్ గాని వీటన్నిటి మెటబాలిజంకి, గ్రోత్ కి Vitamin B12 అనేది కచ్చితమైన అవసరం ఉంది. వీటి డెఫిసిఎన్సీలో RBC కానాల సైజ్ పెరగడం, ఎనిమియా రావడం జరుగుతుంది. చాలా ఏళ్ళ తరబడి Vitamin B12 Deficiency ఉంటే నరాలు ఎఫెక్ట్ అవుతాయి.

Vitamin B12 ఉండే ఆహారం..

పాలు, పెరుగు, వెన్న, చేపలు, గుడ్లు, మాంసం, ఇలా జంతు సంబంధిత ఆహారాలలో Vitamin B12 ఉంటుంది.. అందుకే తినే ఆహారంలో ఇవి ఉండేలా జాగ్రత్త పడటం ద్వారా Vitamin B12 లోపం రాకుండా చూసుకోవచ్చు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో Vitamin B12 లోపం ప్రధానంగా కనిపిస్తుంటుంది. కాబట్టి శాకాహారం తీసుకునేవారు పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి.
ఇక పిల్లల్లో Vitamin B12 లోపం ఉందా లేదా అనే విషయం తల్లిదండ్రులకు తెలిసే అవకాశం తక్కువ ఏడాదిలోపు పిల్లల్లో 0.5 మైక్రో గ్రాములు, ఏడాది నుండి 13 ఏళ్లలోపు పిల్లల్లో 0.9 నుండి 1.8 మైక్రో గ్రాముల దాక Vitamin B12 లెవల్స్ ఉండాలి.. కాబట్టి..రక్త పరీక్షా ద్వారా పిల్లల్లో Vitamin B12 లోపం ఉందని తెలిస్తే విటమిన్ సప్లిమెంట్లని తీసుకోని ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. Vitamin B12 ప్రస్తుతం ఇంజక్షన్ ల రూపంలో కూడా అందిస్తారు.
ఎదిగే వయస్సులోని పిల్లలకి వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి Vitamin B12 చాలా అవసరం. తగినంత Vitamin B12 అందకపోతే అది పిల్లల్లో ఎదుగుదల లోపాలను రక్తహీనత, మెదడు, నాడి సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలకు చిన్నవయస్సు నుంచి పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా అందించాలి. గుడ్లు, చేపలు, మాంసాహారాలను తరచుగా అందిస్తుంటే B12 లోపం తలెత్తకుండా నివారించవచ్చు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news