ఇంట్లో అక్వేరియం, మనీప్లాంట్‌ ఉంచడం వల్ల మంచి జరుగుతుంది అనుకుంటున్నారా..?

-

ఇంట్లో ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవద్దు మనకు కనీస అవగాహన ఉండాలి లేదంటే.. లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది ఇళ్లలో అక్వేరియం ఉంటుంది. అందులో రంగురాళ్లను, చేపలను వేసి పెంచుతుంటారు. ఇలాంటివి చూసినప్పుడు అందంగానే ఉంటాయి..కానీ అవి ఇంట్లో ఉండటం అంత మంచిది కాదట. అక్వేరియాల‌ను ఇంట్లో ఉంచుకుంటే చెడు జ‌రుగుతుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక్క అక్వేరియ‌మే కాదు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంట్లో ఉంచ‌కూడ‌ని వ‌స్తువుల గురించి అలాగే వాటిని ఇంట్లో ఎందుకు ఉంచ‌కూడ‌దు అన్న విష‌యాల గురించి ఓ లుక్కేద్దామా..!

- Advertisement -

తొట్టిలో, గ్లాస్ పెట్టెలో నీళ్లు పోసి చేప‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల ఆ ఇంటి య‌జ‌మానికి అన్నీ క‌ష్టాలే క‌లుగుతాయ‌ట‌. మాన‌సిక ఆనందం కూడా దూర‌మ‌వ‌తుంద‌ట‌. అప్పులు పెరుగుతాయి.. అందుక‌ని అక్వేరియాన్ని ఇంట్లో ఉంచ‌కూడ‌ద‌ని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇక ఇంట్లో ప‌ని చేయ‌ని గ‌డియారాలు కూడా ఉండ‌కూడ‌దు. అలాగే ఇంట్లో మ‌హా భార‌త యుద్ద స‌న్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, పోస్ట‌ర్లు అస్స‌లు పెట్ట‌కూడ‌దు. వీటిని ఇంట్లో ఉంచుకోవ‌డం వ‌ల్ల ఇంట్లోని వారికి అన్నీ క‌ష్టాలే ఎదువర‌వుతాయ‌ట‌.

మనీప్లాంట్ కూడా ఇలా ఉండకూడదు..

చాలా మంది ఇళ్లలో మ‌నీ ప్లాంట్స్ పెంచుకుంటారు. దాని వ‌ల్ల అదృష్టం, ధ‌నం క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తారు. నిజానికి మ‌నీ ప్లాంట్‌ల‌ను కూడా ఇంట్లో పెట్టుకోకూడ‌దు. వాటి వల్ల అంతా నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంద‌ట‌. దీంతో ఇంట్లోకి దుష్ట శ‌క్తులు వ‌స్తాయి..అయితే మ‌నీ ప్లాంట్‌ను ఇంటి బ‌య‌ట పెంచుకోవ‌చ్చు.

అలాగే ఇంట్లో క‌ప్పలు ఉండ‌కూడ‌దు. అలా ఉంటే ఆ ఇంట్లో ఉండే వారికి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ట‌. ఇక త‌ల‌కు పైన వేలాయుధంతో కూడిన కుమార‌స్వామి బొమ్మ అస్స‌లు ఇంట్లో ఉండ‌కూడ‌ద‌ట‌. అలాగే ఇంట్లో అడుగు కంటే ఎక్కువ ఎత్తులో ఉండే దేవ‌తా విగ్ర‌హాల‌ను ఉంచుకోకూడ‌ద‌ట‌. వాస్తు ప్రకారం ఎక్కువ ఎత్తులో ఉండే విగ్ర‌హాల‌ను ఉంచుకోవ‌డం మంచిది కాదు.

వ్యాపారం చేసే ప్రదేశాలు ఇలా ఉండాలి..

వ్యాపారాలు చేసే ప్రాంతాలు ఏవైనా అవి చ‌తుర‌స్రాకారం లేదా దీర్ఘ‌చ‌తుర‌స్రాకారంలోనే ఉండాల‌ట‌.వ్యాపార ప్రాంతానికి తూర్పు, ద‌క్షిణ దిక్కులో ఎక్కువ విశాలంగా ఉండేలా చూసుకోవాల‌ట‌. దీని వ‌ల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేసే వారు తూర్పు దిశ‌లో నిల‌బ‌డి పూజ చేయాలి. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ట‌. వ్యాపారంలో కూడా లాభాలు వ‌స్తాయ‌ట‌.

ఇంటికి ఎదురుగా వైద్య శాల‌లు, మాంసం దుకాణాలు, ఇనుము, ఇనుప వ‌స్తువులు త‌యారు చేసే షాపులు ఉండ‌కూడ‌ద‌ని వాస్తు చెబుతుంది. అలా ఉంటే ఆయా ఇండ్ల‌ల్లో నివ‌సించే వారికి అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయట‌. ఇంట్లో అంటే మనచేతుల్లో పని.. ఇంటి ఎదురుగా అవి ఉండకూడదు అంటే ఎలా అంటారేమో.. ఒక వేళ అలాంటి షాపులు మీ ఇంట్లో ఉంటే.. వాస్తు నిపుణులతో మీరు ఏం చేయాలో చేయించుకోండి.. ప్రతిదోషానికి ఒక నివారణ ఉంటుంది.. కొత్తగా ఇంట్లో అద్దెకు దిగేవాళ్లు, కొనేవాళ్లు అయితే ముందే అలాంటి లేకుండా చూసుకోవచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...