టాయిలెట్ లో చేసే ఈ ఒక్క తప్పు ఎంత పెద్ద శిక్షకి దారి తీస్తుందో తెలుసా..?

-

గతంలో టాయిలెట్ లోకి పేపర్ తీసుకెళ్ళడం అలవాటు ఉండేది. టాయిలెట్ లో పేపర్ చదువుతూ పని కానిచ్చేవాళ్ళు చాలా మంది. టైమ్ సేవ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో అలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అలవాటు పోయింది. పేపర్ స్థానంలో స్మార్ట్ ఫోన్ ని తీసుకువెళుతున్నారు. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తమైపోయాయి కాబట్టి, స్మార్ట్ ఫోన్ ని టాయిలెట్ లోకి తీసుకెళ్తున్నారు. కానీ అలా చేయడం చాలా తప్పని, దానివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయన్న సంగతి చాలా మందికి తెలియదు.

ఇంటి మొత్తంలో టాయిలెట్ లోనే ఎక్కువ సూక్ష్మక్రిములు ఉంటాయి. టాయిలెట్ డోర్, టాప్, మొదలగు మనం తాకే వస్తువులకి ఈ సూక్ష్మ క్రిములు అతుక్కుని ఉంటాయి. ఎప్పుడైతే మనం స్మార్ట్ ఫోన్ ని తీసుకుని టాయిలెట్ లోకి వెళతామో, అక్కడ ఉన్న వాటిని తాకాల్సి ఉంటుంది. వాటిని తాకి మరలా ఫోన్ ముట్టుకుంటారు. అప్పుడే సూక్ష్మ క్రిములు స్మార్ట్ ఫోన్ ని అంటుకుంటాయి. ఫోన్ మీద సూక్ష్మ క్రిములు ఎక్కువ కాలం బతక గలుగుతాయి. అదీగాక ఫోన్ ని క్లీణ్ చేసే అలవాటు చాలా మందికి ఉండదు.

అలా అంటుకున్న క్రిములు బయటకి వచ్చాక ఇతర పదార్థాల మీద వాలి, శరీరంలోకి వెళ్తాయి. దీనివల్ల ప్రమాదకరమైన ఈ కోలి, సాల్మోనెల్లా అనే బాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. ఈ బాక్టీరియా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఏ పనీ చేయాలనిపించకపోవడం వంటి సమస్యలు దీని ద్వారా వస్తాయి. అంతే కాదు, స్మార్ట్ ఫోన్ ని వాడడం వల్ల కావాల్సిన దానికంటే ఎక్కువ టైమ్ బాత్రూమ్ లో గడుపుతాం. అది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. రక్త మొలలు ఏర్పడడానికి ఇది కూడా ఓ కారణమే.

ఈ విషయాలేవీ తెలుసుకోకుండా ఇబ్బంది పడి ఆరోగ్య పరంగా హాని కలుగజేసుకుంటే మీకే ప్రమాదం. అందుకే టాయిలెట్ లోకి ఫోన్ తీసుకెళ్ళకపోవడమే ఉత్తమం. అంతే కాకుండా అప్పుడప్పుడు స్మార్ట్ ఫోన్ ని శానిటైజర్ తో శుభ్రపరిస్తే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news