ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!

ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి అలవాట్లు ఉంటే మానుకోవడం మంచిది. ఆరోగ్యంగా ఉండడం కోసం వివిధ రకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా ఉండడం మొదలు మంచి ఆరోగ్యకరమైన పద్ధతులని మీరు కూడా పాటించండి. కొన్ని కొన్ని చిన్న చిన్న చెడు అలవాట్లు కారణంగా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. మరి కిడ్నీలు ఎటువంటి అలవాట్లు ఉన్న వాళ్లలో పాడైపోతాయి అనేది ఇప్పుడు చూద్దాం.

ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం:

పెయిన్ కిల్లర్లని ఎక్కువగా వాడితే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. తలనొప్పి, కడుపునొప్పి మొదలైన సమస్యల వలన చాలామంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండండి.

ప్రాసెస్డ్ ఫుడ్:

ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది ప్రతిరోజు ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలు చెడిపోతాయని గుర్తుంచుకోండి.

నిద్ర లేకపోవడం:

నిద్ర లేకపోవడం వలన కూడా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి రోజు మంచి నిద్రను పొందడానికి చూసుకోండి.

తక్కువ నీళ్లు తాగడం:

నీళ్లు తక్కువ తాగడం వలన కూడా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలు కూడా కలగవచ్చు.

మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం:

మాంసాన్ని అధికంగా తీసుకోవడం వలన కూడా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది.