సయాటికా నొప్పి తట్టుకోవడం చాల కష్టం. నిజంగా చాలా మంది ఈ సమస్య తో బాధ పడుతూ ఉంటారు. దీనికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం…!
వయసు:
వయసు మారే కొద్దీ స్పైన్ లో మార్పులు కారణంగా ఇది రావచ్చు. అయితే సయాటిక రావడానికి వయసు ప్రభావం కూడా చూపుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్ది ఇది రావచ్చు.
ఉద్యోగం:
కొంత మంది బరువులు ఎత్తే ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు. ఎక్కువ బరువులు మోయడం లేదా దూర ప్రాంతాల వరకు డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల కూడా సయాటిక రావచ్చు. అయితే సరైన కారణమంటూ దీనికి లేదు.
డయాబెటిస్:
సయాటికా నొప్పి రావడానికి గల కారణం డయాబెటిస్ కూడా అవ్వచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే బాడీ బ్లడ్ షుగర్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. దీని ద్వారా నెర్వ్ డ్యామేజ్ అవుతుంది.
ఒబిసిటీ:
ఊబకాయం వల్ల కూడా సయాటికా వస్తుంది. స్పెయిన్ మీద ఒత్తిడి ఎక్కువగా పడితే సయాటికా కి దారి తీస్తుంది.
ఎక్కువ సమయం కూర్చోవడం:
ఎవరైతే ఎక్కువ సమయం కూర్చుంటూ ఉంటారో వాళ్ళలో కూడా సయాటికా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కదులుతూ ఉండటం మంచిది.
ఈ నొప్పి నుంచి బయట పడాలంటే ఏం చేయాలి..?
ఈ నొప్పిని తట్టుకోలేక పోతున్నారా..? అయితే ఈ చిన్న చిన్న టిప్స్ ని అనుసరించండి. దీనివల్ల మీరు నొప్పి నుంచి బయటపడవచ్చు.
వ్యాయామం చేయడం:
రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఉండండి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఈ నొప్పి నుంచి మీరు సులువుగా బయటపడడానికి వీలు ఉంది.