మంచి నిద్రని పొందాలంటే రాత్రి ఈ ఐదింటినీ తినండి..!

-

చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టదు. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అందుకనే నిద్రపట్టకపోతే ఖచ్చితంగా సమస్య అని గుర్తించాలి. ఎందుకంటే దీని వల్ల ఆరోగ్యమే తగ్గిపోతూ ఉంటుంది. నిద్ర పోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా ఆరోగ్యం మరింత బాగుంటుంది. అయితే ఈ ఆహార పదార్థాలను ప్రతి రోజు రాత్రి నిద్ర పోయేటప్పుడు తీసుకుంటే కచ్చితంగా మంచి నిద్రను పొందవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ ఆహార పదార్థాల గురించి చూసేద్దాం.

 

అరటి పండు:

అరటి పండు ప్రతి సీజన్ లో మనకు దొరుకుతుంది. దీని వల్ల మనకి పోషక పదార్థాలు అందుతాయి. సామర్థ్యాన్ని త్వరగా పెంచడానికి అరటిపండ్లు సహాయపడతాయి. మంచిగా నిద్ర పోవడానికి అరటి పండ్లు మేలు చేస్తాయి. కనుక రాత్రిపూట అరటి పండ్లు తీసుకోండి.

బాదం:

బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బాదం తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్రను పొందవచ్చు. ఇందులో మెగ్నీషియం మరియు ఇతర పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. మజిల్స్ కి మరియు నరాలకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు రాత్రిపూట బాదం తీసుకుంటే మంచి నిద్ర పొందొచ్చు .

తేనే:

తేనె కూడా మంచి నిద్రను పొందడానికి సహాయపడుతుంది. ఒక టీ స్పూన్ తేనె తీసుకుంటే బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. అలానే నిద్రలేమి సమస్య నుండి కూడా బయట పడచ్చు. అందుకని రాత్రిపూట ఒక టీ స్పూన్ తేనే తీసుకోండి.

ఓట్స్:

ఓట్స్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ సమృద్ధిగా ఉంటాయి. రాత్రిపూట ఓట్స్ ను తీసుకుంటే మంచి నిద్ర పొందొచ్చు.

టర్కీ:

టర్కీ లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి దీనితో కడుపు నిండుతుంది. అదేవిధంగా నిద్రలేమి సమస్య నుండి కూడా బయటపడొచ్చు. ఈ ఆహార పదార్థాలను మీరు రాత్రిపూట తీసుకుంటే మంచి నిద్ర ఉంటుంది అలానే మీరు ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news