వేపాకులు తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ రోజుకు ఎన్ని తినాలి..? ఎక్కువైతే డేంజరే

-

తినగ తినగ వేము తియ్యనుండు..అలా అనీ మరీ తింటే…నష్టాలుండు..అర్థం కాలేదా.. వేపాకులో ఎన్నో ఔషధగుణాలున్నాయి.. ఈ ఆకులను రోజు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే మంచిది కదా అని ఎడా పెడా తింటే లేనిపోని సమస్యలు కూడా వస్తాయి..అసలు రోజుకు ఎన్ని వేపాకులు తినాలి.. ఎవరు తినకూడదు. ?

రోజులో ఎన్ని వేప ఆకులు తినాలి?

వేప ఆకులు మీ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి. కడుపులో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.. కానీ మీరు వేప ఆకులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది మీకు హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజులో 6 నుంచి 8 వేప ఆకులను మాత్రమే తీసుకోవాలట.. దీనికి మించి వేప ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు.. అవేంటంటే..

వేప ఆకులను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు..

వేప ఆకులను క్రమం తప్పకుండా నమలడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇలాంటి సమయంలో మీరు పెద్ద పరిమాణంలో వేప ఆకులను నమిలితే.. అది చక్కెర స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది.
గర్భిణులు వేప ఆకులను తీసుకునే ముందు నిపుణుడిని తప్పక సంప్రదించాలి.
వేప ఆకుల రసం కళ్లలో పడితే మంట, ఎర్రగా మారుతాయి. వేపాకు రసాన్ని జుట్టుకు రాసేటప్పుడు.. అది కళ్లలోకి వెళ్లకుండా చూసుకోండి..
వేపను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి రుచి పోతుంది.

వేపాకుని మితంగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..

పరగడుపున వేప ఆకులు తినడం వల్ల హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
వేప ఆకులు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు పోరాడుతాయి.
ఖాళీ కడుపుతో వేప ఆకులు తినడం వల్ల శరీరంలోని విషపూరిత పదార్థాలను, మలినాలు దూరమై.. ఉదర ఇబ్బందులు తలెత్తవు.
కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడకుండా వేపాకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
సో.. అదనమాట మ్యాటర్…మితంగా తింటే మంచిది..మితి మీరితే ప్రమాదమే అంటున్నారు నిపుణులు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version