40 ఏళ్లు దాటాక కూడా రోజూ వ్యాయామాలు చేస్తున్నారా..? అయితే రిస్క్‌ ఎక్కువే..

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలితో పాటు డైలీ వ్యాయామం చేయమని వైద్యులు చెప్తారు.. అయితే వయసు పైబడే కొద్ది వ్యాయామం చేయడం అంత మంచిది కాదట.. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు రోజు కఠినమైన వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి మేలు చేయదని నిపుణులు అంటున్నారు. సినిమా వాళ్లను పక్కన పెడితే సామాన్యులు ఇలా కఠిన వ్యాయామాలు చేయకపోవడమే ఉత్తమం.. దీని వల్ల ప్రమాదకరమైన జబ్బుల భారిన పడే అవకాశం ఉంది.

40 సంవత్సరాలు దాటిన వారు రోజువారిగా తేలిక పాటి వ్యాయామాలు చేయటం మంచిది. అతిగా వ్యాయామాలు చేయటం వల్ల హార్మోన్స్‌లో అసమతుల్యత, గుండె పోటు, బ్రెయిన్ హెమరేజ్ వంటివి చోటు చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఆ ఏజ్‌ వచ్చేసరికి అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు… అలాంటి వారు బరువు తగ్గించుకునేందుకు క్లిష్టతరమైన వ్యాయామాలను ఎంచుకుంటుంటారు. వీటి వల్ల బరువు తగ్గటంమేమోగాని ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

బరువు ఎక్కువ ఉన్నవారు కూడా ఎక్కవుసేపు ఎక్సర్‌సైజ్ చేయకూడదు. దీని వల్ల కండరాల నొప్పి, గుండె ఆగిపోవడం, బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిపోవడం వంటివి జరగొచ్చు. కండరాలను బలోపేతం చేయడానికి తేలికపాటి వర్కౌట్స్ చేయడం మంచిది.

వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఎక్కువ సమయం చేయకుండా మధ్య మధ్యలో కొద్ది సమయం విరామం ఇవ్వాలి. హార్ట్‌ బీట్‌ ఎక్కువవుతున్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి.. వారంలో 4 నుంచి 5 రోజులు ఎక్సర్‌సైజ్ చేస్తే సరిపోతుంది. వారంలో ఒకటి రెండు రోజులు కండరాలకు విశ్రాంతిని ఇవ్వాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అదే సమయంలో అధిక బరువులు ఎత్తే ప్రయత్నం చేయకూడదు. ఎక్కువ బరువు ఎత్తడం వల్ల వెన్నెముక సమస్యలు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. కఠినమైన వ్యాయామాలు చేయటం వల్ల గాయాలయ్యే అవకాశం లేకపోలేదు. అవి పూర్తిగా నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అధిక రక్తపోటు, గుండె ఆరోగ్యం సరిగా లేని వారు వైద్యుల సూచనలు సలహాలు తీసుకునే వ్యాయామాలు చేయాలి. దీర్ఘకాలికంగా కఠినమైన వ్యాయామం ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువ హాని కలిగించవచ్చని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి. కాబట్టి 40 వయసు దాటిన వారు రోజు వ్యాయామాలు చేస్తుంటే కాస్త జాగ్రత్త తీసుకోవడమే ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news