నిన్ను కాపాడ్డానికి ఎవడున్నార్రా.. బచ్చా.. మెగా అభిమానులకు పూనకాలే

-

మెగా అభిమాల నిరీక్షణకు తెరపడింది. ఎంతగానో ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. అంచనాలకు తగినట్లే ట్రైలర్‌లో మెగాస్టార్ చిరంజీవి సూపర్ డైలాగ్స్‌తో అదరగొట్టేశారు. అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుండగా.. నేడు (సెప్టెంబర్ 28) అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ ను గ్రాండ్‌ జరుగుతోంది. ఈ వేదికపైనే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

Image

మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మాక మరణం.. మంచోళ్లు అందరూ మంచోళ్లు కారు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి.. వెనకగా. అన్ని రంగులు మారతాయి అంటూ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వాయిస్‏తో మొదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నిన్ను కాపాడ్డానికి ఎవడున్నార్రా.. బచ్చా.. అంటూ మెగా స్టార్ చెప్పిన డైలాగ్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news