ఊపిరితిత్తుల సంరక్షణ: శ్వాసకోశ వ్యాధులని దూరం పెట్టే ఆహారాలు..

-

కరోనా టైమ్ లో ఊపిరితిత్తుల సంరక్షణ ఎంత అవసరమో చెప్పాల్సిన పనిలేదు. శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి, ఊపిరితిత్తుల గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాపాడే అద్భుతమైన ఐదు ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉండడానికి విటమిన్ సి, ఈ, బీటా కెరాటిన్ చాలా అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. దాని ప్రకారం అవన్నీ పుష్కలంగా దొరికే పండు ఏదైనా ఉందంటే అది ఆపిల్ అని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వాల్ నట్స్

ఒమెగా 3 కొవ్వులు అధికంగా గల వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరంపై దాడి చేసే సూక్ష్మ క్రిములని బయటకి పంపే లక్షణాలు కలిగి ఉన్న వాల్ నట్స్ ని ఆహారంలో భాగం చేసుకోవాలి.

బెర్రీలు

శరీరంపై బాగా ప్రభావం చూపే బ్లూ బెర్రీలు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరిచే విటమిన్ సి ఉంటుంది కాబట్టి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కణాలు చెడిపోకుండా, చెడిపోయిన కణాలను మెరుగుపరిచే శక్తి బెర్రీలకి ఉంది.

బ్రోకోలీ

సి విటమిన్, కెరటనాయిడ్స్ అధికంగా ఉండే బ్రోకోలీ శ్వాస వ్యవస్థ పని తీరును చెడిపోకుండా కాపాడుతుంది.

పై నాలుగు ఆహారాలు మీ రోజు వారి జీవితంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తుల పనితీరు పెరిగి, శ్వాసకోశ ఇబ్బందులు రాకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news