మగవారిలో సంతాన లేమి సమస్యకు నల్ల తుమ్మ దివ్య ఔషధమే..!

-

పల్లె టూర్లలో ఎక్కడ పడితే అక్కడ విరివిగా నల్లతుమ్మచెట్లు కనిపిస్తాయి. వీటి విలువ తెలియక ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ మీకు తెలుసా.. నల్ల తుమ్మచెట్టులో ప్రతి భాగంలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. చెట్టు కాండంతో గృహ అవసరాలు, వ్యవసాయ పనిముట్లు చేస్తారు. ఆకులు మేకలు తింటాయి. ఇంతేనా..మగవారిలో వచ్చే సంతాన లేమి సమస్యను తగ్గించడంలోనూ ఈ చెట్టు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

 

మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, ఆహారపు అలవాట్ల కారణంగా మగ వారిలో సంతాన లేమి సమస్యలు వస్తాయి. సంతాన లేమి సమస్యలకు తుమ్మ చెట్టు దివ్య ఔషధంగా పని చేస్తుందట.

తుమ్మ జిగురును పొడిగా చేసి నెయ్యిలో వేయించి శరీర బలాన్ని బట్టి కొద్ది కొద్దిగా తినడం వల్ల మగ వారిలో వీర్య కణాలు వృద్ది చెందుతాయట. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తుమ్మ చెట్టు పూలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. తుమ్మ చెట్టు బెరడు, లేత కాయలు, ఆకులు, పువ్వులను నీడలో ఎండబెట్టి చూర్ణంగా చేసి సమపాళ్లలో కలిపి ఆ పొడిని ప్రతిరోజూ పావు టీ స్పూన్ చొప్పున తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దృఢంగా మారతారట.

తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల నీరసం తగ్గి బలాన్ని పుంజుకుంటారు. ఈ కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడంతోపాటు నోటి పూత, నోటిలో ఉండే పుండ్లతోపాటు దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాళ్ల పగుళ్లను తగ్గించే శక్తి తుమ్మ బంకకు ఉంది. తుమ్మ బంకను నీటితో మెత్తగా నూరి రాత్రి పూట కాళ్ల పగుళ్లకు లేపనంగా రాస్తూ ఉంటే కొన్ని రోజులకు కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.

ఈ వ్యాధులను సైతం దూరం చేయగలదు..

రక్తస్రావం, ల్యుకోరియా, స్క్లెరోసిస్, ఆప్తాల్మియా, మశూచి, నపుంసకత్వం వంటి వ్యాధులు సైతం దూరమౌతాయి. నల్ల తుమ్మ కాయల రసాన్ని తీసి మినుములతో కలిపి ఔషధంగా తయారు చేసి పాలతో కలిపి తాగడం వల్ల నరాల బలహీనత, వీర్య నష్టం, శీఘ్ర స్కలనం వంటి సమస్యలు తగ్గి అమితంగా వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. నల్ల తుమ్మ విత్తనాలు మొలకెత్తిన తరువాత కూరల్లో వాడుకోవచ్చు. వాటిని మద్యం తయారీలో ఉపయోగిస్తారు. నల్ల తుమ్మ బెరడుతో కషాయం తయారు చేసి రోజూ నోట్లో వేసుకుని పుక్కిలిస్తుంటే అల్సర్లు తగ్గుతాయి. తుమ్మ ఆకులను నీటితో నూరి చర్మానికి రాయడం వల్ల అధిక చెమట సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news