రెయిన్ బో డైట్ గురించి విన్నారా..అందమైన ఆరోగ్యం ఈ డైట్ తో సొంతం..ఈ ఏడాదినుంచి షురూ చేసేద్దాం

-

ప్రకృతి తినడానికి మనకు ఎన్నో ఇచ్చింది. కానీ మనమే సహజసిద్దంగా వచ్చేవాటిని పక్కనపెట్టి..ఫాస్ట్ ఫుడ్ వైపు పరుగులుతీస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఎన్నోరకాల డైట్స్ చేస్తుంటారు. కానీ మీరు రెయిన్ బో డైట్ గురించి విన్నారా..అంటే ఏం లేదు అండి..రెయిన్ బో ఎన్ని రంగులు ఉంటాయో మన ప్లేట్ లో కూడా అన్ని రంగుల ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవడమే. రెయిన్‌బో డైట్‌లో చేర్చిన ఆహారాలు .. వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

తెలుపు ఆహారం

బంగాళదుంపలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, అరటిపండ్లు ..టర్నిప్‌లు వంటి ఆహారాలు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు శరీరాన్ని డామినేట్ చేయడానికి అనుమతించవు. వాటిలో ఎక్కువ ఫైబర్ ..పొటాషియం ఉంటుంది.

ఎరుపు ఆహారం

ఎరుపు రంగులో ఉండే చాలా కూరగాయలు ..పండ్లు మన హృదయానికి మేలు చేస్తాయట.. రెడ్ బెల్ పెప్పర్స్, దానిమ్మపండ్లు, టమోటాలు, దుంపలు, పుచ్చకాయలు, యాపిల్స్..స్ట్రాబెర్రీలు వంటి వాటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్..తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. దీంతో పాటు వాటి ఎరుపు రంగుకు కారణమైన ఆంథోసైనిన్ సమ్మేళనం కండరాలను బలంగా ఉంచుతుంది.

నారింజ ఆహారం

నారింజ రంగు పండ్లు ..కూరగాయలలో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నారింజ, గుమ్మడికాయలు, క్యారెట్లు ..పీచెస్ వంటివి కూడా జుట్టు ..చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

పసుపు ఆహారం

బొప్పాయి, పైనాపిల్, నిమ్మ, మామిడి, మొక్కజొన్న వంటి పండ్లు ..కూరగాయలలో లభించే బ్రోమెలైన్ ..పాపైన్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పసుపు ఆహారాలలో ఉండే లుటీన్ జియాక్సంతిన్ పిగ్మెంట్లు, వయస్సు సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటాయి.

ఆకుపచ్చ ఆహారం

ఆకుపచ్చ కూరగాయలు ..పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయని ఎప్పటినుంచే వైద్యులు చెబుతున్నమాటే. అవి చాలా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహం ..గుండె జబ్బులతో పోరాడతాయి. ఇందులో ఫోలేట్..ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, మీరు మీ ఆహారంలో బచ్చలికూర, మెంతులు, బతువా, క్యాబేజీ, బీన్స్, బఠానీలు, బ్రోకలీ, గుమ్మడికాయ, కాలే, పార్స్లీ, సెలెరీ, కివీ, దోసకాయ, ద్రాక్ష, గ్రీన్ యాపిల్ ..పుదీనాను చేర్చుకోవాలి.

నీలం లేదా ఊదా రంగు ఆహారం

బెర్రీలు, ఎర్రటి కూరగాయలు, నల్ల ద్రాక్ష, వంకాయ, బ్లాక్‌బెర్రీస్..బ్లూబెర్రీస్ వంటివి మెదడు సామర్థ్యానికి పనిచేస్తాయి. వీటిలో ఉండే ఆంథోసైనిన్ ..రెస్వెట్రోల్ ఎలిమెంట్స్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి..శరీరంలో మంటను తగ్గిస్తాయి.

రెయిన్‌బో డైట్‌ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే..కానీ ఈ ఉరుకులపరుగుల జీవితంలో డైలీ ఇదంతా ఫాలో అవడం అయ్యేపనికాదు..మీ ప్లేట్‌కి ఎన్ని రంగులు జోడించగలిగితే అని ఆహారపదార్థాలు యాడ్ చేయడానికి ప్రయత్నించండి. ఒక రోజులో 5 రకాల పండ్లు ..కూరగాయలు ..ఒక వారంలో కనీసం 20 రకాల పండ్లు ..కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news