భారతీయవంటకాల్లో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంగువను వంటల్లో విరివిగా వాడుతారు. దీన్ని ఎక్కువగా శాఖాహారులు వాడుతారు. ఇంగువ కేవలం వంటలకే పరిమితం కాదు. ఇంగువతో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. మరి ఇంగువ వంటలే కాకుండా ఎలాంటి ఉపకారం చేస్తుందో చూద్దాం.
పిల్లలకు తిన్న అన్నం జీర్ణంకాక కడుపు నొప్పి వస్తుంది. దాంతో వారు నోరు తెరిచి చెప్పలేరు. అలాంటి సమయంలో కడుపు గట్టిగా ఉందో లోదో చెక్ చేసి సొంటి ఇస్తారు. ఇలా సొంటి మాత్రమే కాకుండా ఇంగువ కూడా ఉపయోగపడుతుంది.
– ఇంగువను పురాతన కాలం నుంచి అజీర్తికి ఇంటివైద్యంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో కడుపు మంటను తగ్గించే గుణం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, అజీర్తి లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అరకప్పు నీటిలో కొన్ని ఇంగువ ముక్కలను కరిగించి తీసుకోవాలి. దీంతో అజీర్తి, రుతు సమస్య నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
– స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు.. అంటే.. నొప్పి, తిమ్మిరి బాధతో కూడిన రుతుక్రమాలు వంటి వాటికి ఇంగువ ఒక శక్తివంతమైన మందు. రోజూ ఆహారంలో ఇంగువను భాగం చేసుకుంటే స్త్రీ సంబంధిత సమస్యలు ఎదురుకావు.
– శ్వాసను ఉత్తేజ పరిచే మందుగా, కఫము తగ్గించడానికి, ఛాతిపైన ఒత్తిడి తగ్గించడానికి ఇంగువ పనిచేస్తుంది. తేనె, అల్లంతో కూడిన ఇంగువను తీసుకుంటే దీర్ఘకాలంగా ఉన్న పొడిదగ్గు, కోరింత దగ్గు, శ్వాసనాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
– ఇంగువను డయాబెటిస్ వైద్యంలో కూడా వాడుతారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సూలిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కాకరకాయను ఇంగువతో కలిపి వండాలి.
– ఇంగువలో ఉన్న కొమరిన్‌లు రక్తాన్ని పలుచగా చేసి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. ఇంగువ వైద్య ప్రభావంతో పాటు అధిక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా రక్షిస్తుంది. తక్కువ రక్తపోటుకు సహాయపడుతుంది. ఆహారంలో ఇంగువ వాడడం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా మూర్ఛ, సొమ్మసిల్లడం, ఇతర నాడీ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది.