చెంచలాకును చూసే ఉంటారుగా..! తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

-

ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్క ఒక స్పెషల్‌ బెనిఫిట్‌తోనే ఉంటుంది. ఆ మొక్కల విశిష్టత మనకు తెలియనంత వరకూ అది పిచ్చిమొక్కే అని భావిస్తాం. అంతెందుకు పొలాల్లో కలుపు మొక్కలు అనిచాలా పీకేస్తుంటారు. ఆ కలుపు మొక్కల్లో కూడా అద్భుతమైని ఎన్నో ఉంటాయట. అలాంటిదే ఈ చెంచలాకు. పొలం గట్ల వెంబడి ఇవి అధికంగా ఉంటాయి. పూర్వం రోజుల్లో కలుపు మొక్కలను వంటల్లో కూడా వాడేవారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల వారు చెంచలాకుతో పప్పులు వంటివి చేసుకుని తింటారు.

చెంచలాకు ప్రయోజనాలు..

చెంచలాకులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వాత, పిత్త, కఫ దోషాలను పొగొడుతుందని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీనిని ఔషధంగా వాడేవారు.

ఈ మొక్కలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి.

అనేక రకాల రోగాలను నయం చేయడంలో చెంచలాకు బాగా ఉపకరిస్తుంది.

చెంచలాకులో కాల్షియం అధికమోతాదులో ఉంటుంది. దీన్ని తినటం వల్ల ఎముకలు ధృఢంగా తయారవుతాయి.

కంటి సమస్యలను దరి చేరకుండా ఉంచటంలో ఇందులో ఉండే విటమిన్ ఎ దోహదపడుతుంది.
చిన్నపిల్లలకు ఈ ఆకు కూరను పప్పులో వేసి పెడితే ఎంతో మంచిది. ఎంతో ఇష్టంగా కూడా తింటారు. శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించటంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది.

జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంతోపాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది.

బాలింతలో పాలు బాగా రావాలంటే.. ఈ చెట్టు వేర్ల కషాయాన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట..

మొక్క ఆకుల కషాయాన్ని కొద్ది మోతాదులో తాగడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయట. ఆకులను పేస్ట్‌గా చేసి గాయాలపై, పుండ్లపై ఉంచడం వల్ల త్వరగా మానిపోతాయి.

ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news