డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్నారా..? అనేక లాభాలు క‌లుగుతాయి తెలుసా..!

-

డ్రాగ‌న్ ఫ్రూట్ చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. చూసేందుకు డ్రాగ‌న్‌ను పోలిన ఆకృతి ఉంటుంది క‌నుక‌నే దీన్ని డ్రాగ‌న్ ఫ్రూట్ అని పిలుస్తారు. డ్రాగ‌న్ ఫ్రూట్ ఎక్కువగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాల‌లో పండుతుంది. ఇక ఈ పండు రుచి కివీ, పైనాపిల్‌ల‌ను పోలి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే డ్రాగ‌న్ ఫ్రూట్ తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డ్రాగ‌న్ ఫ్రూట్స్ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

3. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఇన్ఫెక్ష‌న్ల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో క్యాన్స‌ర్ వ్యాధుల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు.

4. ర‌క్త స‌ర‌ఫరా మెరుగుప‌డుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. పొటాషియం ఎక్కువ‌గా ఉన్నందున హార్ట్ స‌మ‌స్య‌లు రావు. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.

5. డ్రాగ‌న్ ఫ్రూట్ వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావు.

6. డ్రాగ‌న్ ఫ్రూట్‌లో విట‌మిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌రుస్తుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు పోతాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news