ఓస్టెర్ పుట్టగొడులు తింటే.. డయాబెటీస్, గుండెజబ్బులకు చెక్ పెట్టేయొచ్చు..!

-

ఈరోజుల్లో..ఘుగర్, గుండెజబ్బులు అనేవి ప్రతినలుగురిలో ఒకరికి ఉంటున్నాయి. ఘగర్ వ్యాధి బారినపడివారికి..అనేక రోగాలు వస్తాయి. ఏది తిందామన్నా భయమే..మానసికంగానూ, శారీరకంగానూ వారి కుంగిపోతారు. ఇష్టమైన స్వీట్స్ ను పక్కనపెట్టేయాలి. ఎంత ఘగర్ ఫ్రీవి తిన్నా..అవి ఆరోగ్యానికి అంత మంచిదికాదు. గుండె జబ్బులుకూడా అంతే. గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు మనం ఏరికోరి తింటాం. ఈరోజు ఘుగర్ వ్యాధికి, గుండెజబ్బులకు దివ్యఔషధంలా పనిచేసే ఒక శాఖాహారం గురించి మనం తెలుసుకుందాం.

ఈ మధ్య పుట్టగొడుగులు అనేవి అనేక సుక్ష్మపోషకాలను అందిస్తాయని అందరూ చెప్పడంతో..ప్రజలు వీటిని తినడానికి ఆసక్తిచూపుస్తున్నారు. మార్కెట్ లో దొరికే బటన్ మష్ రూమ్స్ కంటే.. ఓస్టెర్ పుట్టగొడుగు అనేవి ఎక్కువగా ఫలితాన్ని ఇస్తాయట. వీటి ఆకారం అరచేయిలాగా ఉంటుంది. దీని ఉత్పత్తికూడా కాస్త కాస్ట్లీ ప్రాసెస్ అనే చెప్పాలి. ఓస్టెర్ పుట్టగొడుగు కేజీ 250-350 వరకూ ఉంటాయి. అదే నార్మల్ బటన్ మష్ రూమ్స్ అయితే..కాస్త తక్కువ ఖరీదు ఉంటాయి. విలువలు బాగా ఉన్నాయి కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ

ఓస్టెర్ పుట్టగొడుగు పోషకాలు ఏంటో చూద్దాం..

100గ్రాములు ఓస్టెర్ పుట్టగొడుగు తీసుకుంటే..89గ్రాములు నీటిశాతం ఉంటుంది. ఇది అందించే శక్తి 89కాలరీలు, కార్బోహైడ్రేట్స్ 6గ్రాములు, మాంసకృతులు3.3 గ్రాములు, కొవ్వు0.5 గ్రాములు, ఫైబర్ 2.3 గ్రాములు, పొటాషియం420 మిల్లీగ్రాములు, సిలీనియం 2.6మైక్రోగ్రామ్స్..ఇది యాంటీ ఆక్సిడెంట్ లా బాగా పనికొస్తుంది. నియాసిన్ 5మిల్లీగ్రామ్స్..ఇది బీ విటిమిన్ అన్నట్లు. B12విటిమిన్ శాఖాహారాల్లో ఈ విటిమిన్ ఉండదు..కానీ ఇది శాఖాహారం అయినప్పుటికి..వీటిని పెంచెప్పుడు నేలల్లో ఉండే ఫంగస్ వీటికి B12 అందిస్తాయి. ఇందులో 2-3 మైక్రోగ్రాములు B12 ఉంటుంది. ఒకరోజుకు మన శరీరానికి కావాల్సిన B12 2.4 మైక్రోగ్రామ్స్ మాత్రమే. 100 గ్రాములు ఓస్టెర్ పుట్టగొడుగు తింటే..రోజు మొత్తానికి కావాల్సిన B12 వచ్చేస్తుంది.

ఇక ముఖ్యంగా హార్ట్ కి , డయాబెటిస్కి ఈ మష్ రూమ్స్ స్పెషల్ గా బెనిఫిట్స్ ఏం ఇస్తుందనేది శాస్త్రవేత్తలు నిరూపించారు. 2007వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ జర్మనీవారు ఈ ఓస్టెర్ పుట్టగొడుగు మీద స్పషల్ గా పరిశోధన చేసి అందించారు. 102మందిని తీసుకుని రోజుకు 150గ్రాములు ఓస్టెర్ పుట్టగొడుగుని ఏడు రోజులు పాటు తినిపిస్తే.. ఘగర్ వ్యాధితో బాధపడేవారు ఈ వారంలోనే 22% అంటే ఇతర ఆహార అలవాట్లు ఏవి మర్చకుండా.. వాటితో పాటు ఈ ఓస్టెర్ పుట్టగొడుగు తిన్నవారిలో ఘగర్ 22% తగ్గింది. ఇలా ఘగర్ ఎలా తగ్గుతుంది అనేకదా మీ డౌట్.. ఇందులో ఉన్న బీటా గ్లూకాన్స్ ముఖ్యకారణమట. మన ప్రేగుల్లో గట్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా ఈ మష్ రూమ్స్లో ఉండే షార్ట్ చెయిన్ ఫ్యాటీ ఆసిడ్స్ ని తినేసి బీటాగ్లూకాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇ‌వి డయాబెటీస్ ని తగ్గించడానకి ఉపయోగపడుతున్నాయి అని ఈ పరిశోధనలో తేలింది.

ఇందులో ఇంకా ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే..గ్యాలిక్ యాసిడ్, క్లోరోజనిక్ యాసిడ్స్ అనేవి ఈ మష్ రూమ్స్ లో అధిక మొత్తంలో ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా.. గట్ బ్యాక్టీరియా ప్రోడ్యూస్ చేసే బీటాగ్లూకాన్స్ ఉండటం వల్ల గుండెకు ఆక్సిజన్ సరఫరా చేసే రక్తనాళాల్లో ఎల్డీఎల్ అంటే..కొలెస్ట్రాల్ పేరుకోకుండా బ్లెడ్ విజల్స్ ని హెల్తీగా స్మూత్ గా లోపలినుంచి కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ డిపాజిట్ అవకుండా, హార్ట్ బ్లాక్స్, హార్ట్ ఎటాక్స్ రాకుండా ఈ మూడు కెమికల్ కాంపోజిషన్ బాగా ఉపయోగపడుతున్నాయని జర్మనీవాళ్లు వారి పరిశోధనలో నిరూపించారు.

ఎర్గోతియోనిన్ అనే స్పెషల్ కెమికల్ ఉండటం వల్ల నర్వకణజాల్లో..మెదడునుంచి సంకేతాలు మొసుకెళ్లే నరాలు ఉంటాయికదా..ఆ కణజాలం ఉండే.. సైటోప్లాజింను డామైజ్ అవకుండా రక్షించి, నర్వకండంక్షన్ ని బాగా పనిచేసేట్లు చేస్తాయి. అందుకని నరాల వ్యవస్థకు చురుగ్గా సంకేతాలను చేరవేయడానికి బాగా ఉపయోగపడాతాయి. నరాల కణజాలు ఒకసారి చనిపోతే మళ్లీ పుట్టవు, డామేజ్ అయితే రిపేర్ కావు..అలాంటి నర్స్ సెల్స్ కి అద్భుతంగా ఈ మష్ రూమ్స్ బాగా ఉపయోగడపతాయి.

ఓస్టెర్ పుట్టగొడుగుల జాతులను అబలోన్, ఓస్టెర్ లేదా వుడీ పుట్టగొడుగులుగా పిలుస్తారు. ఓస్టెర్ పుట్టగొడుగులను ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్నారు, ఈ పుట్టగొడుగు ముఖ్యంగా రైతులలో ఆగ్నేయాసియా, యూరప్ మరియు ఆఫ్రికాలోని వ్యక్తిగత గృహాలలో సాధారణం.
ఈ పుట్టగొడుకు కాలు దట్టంగా ఉంటుంది. ఇది పైనుండి సన్నగా, బేస్ వద్ద చిక్కగా ఉంటుంది. బేస్ చక్కగా, తెల్లగా కప్పబడి ఉంటుంది.
ఈ పుట్టగొడుగులను ఇళ్లలో సైతం పెంచుకుంటారు.

ఓస్టెర్ పుట్టగొడుగుల రకాలు:

పెర్ల్ ఓస్టెర్ పుట్టగొడుగులు – ఇది ప్రపంచవ్యాప్తంగా వంటలో ఉపయోగించే ఓస్టెర్ పుట్టగొడుగుల యొక్క అత్యంత సాధారణ రకం.

బ్లూ ఓస్టెర్ పుట్టగొడుగులు – ఈ రకమైన పుట్టగొడుగు ముదురు నీలం రంగులో ఉంటాయి. పరిపక్వమైన తర్వాత నెమ్మదిగా రంగు తేలికవుతుంది.

గోల్డెన్ ఓస్టెర్ పుట్టగొడుగులు – ఇవి పసుపు రంగులో ఉంటాయి. మరింత సంక్లిష్టమైన మంచి వాసన రుచిని కలిగఉంటాయి.

పింక్ ఓస్టెర్ పుట్టగొడుగులు – అవి గులాబీ రంగులో ఉంటాయి, ఇది వండినప్పుడు సహజంగా మసకబారుతుంది. దీని రుచికూడా అమోఘం.

కింగ్ ఓస్టెర్ పుట్టగొడుగులు – దీనిని కింగ్ ట్రంపెట్ పుట్టగొడుగులుగా కూడా పిలుస్తారు. ఇవి మిగతారకాలకంటే..పెద్దవిగా మరియు అన్ని ఓస్టెర్ పుట్టగొడుగులలో అతిపెద్దదిగా పరిగణించబడుతుంది.

సహజంగా ఈరోజుల్లో డబ్బులకు ఇబ్బందిలేదు కాబట్టి జబ్బులు బాగా వస్తున్నాయి. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని..అప్పుచేసైనా..వైద్యం చేయిస్తారు. మీకు ఇష్టమైన పిజ్జా, బర్గల్లు, మటన్ లాంటివి చాలా ఖరీదు ఉంటాయి. అవి ఎంత ఖర్చు ఉన్నప్పటికీ వాటిని కొనడానికి మనం వెనకాడం..అలాంటప్పుడు చక్కటి పోషకాలు, అనేక లాభాలు ఉన్న ఈ ఓస్టెర్ పుట్టగొడుగుని మనం వాడుకుంటే..ప్రాణాంతక వ్యాధులైన గుండెజబ్బులు, ఘుగర్ వ్యాధులు రాకుండానూ..వచ్చినా తగ్గించుకోవచ్చు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news