వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు పాటించండి..

-

వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగి పోతుండడంతో.. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సార్లు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండలేం.. అంతేకాకుండా.. ఇంట్లో ఉన్నవారికి కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.. అయితే.. ఇంట్లోని వేడి వాతావరణమే అందుకు కారణమని డాక్టర్లు అంటున్నారు. ఈ సీజన్​లో ఆరోగ్యాన్ని కాపాడు కునేందుకు ఫిజీషియన్లు చెప్తున్న సలహాలు ఇవి.

ఇంట్లో పొద్దంతా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. కొద్ది సేపయ్యాక గది మొత్తం వేడిగాలితో నిండుతుంది. మామూలుగా 25 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉండాల్సిన గది టెంపరేచర్​ 40 డిగ్రీలకు చేరుతుంది. దాంతో, గదిలో ఉన్నవాళ్ల శరీర టెంపరేచర్​ కూడా పెరుగుతుంది. శరీరాన్ని చల్లబరచడం కోసం నీళ్లు బయటకు పోతాయి. దీంతో వడదెబ్బ లక్షణాలైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట కనిపిస్తాయి.

పిల్లలు, పెద్దవాళ్లు, అనారోగ్యంతో మంచానపడ్డవాళ్లపై ఇంట్లో వేడి ప్రభావం ఎక్కువ. ఎందుకంటే…. వీళ్లు టైంకి నీళ్లు తాగరు. ఎండలో ఆడడం వల్ల శరీరంలో నీళ్లు తగ్గిపోయి పిల్లలు నీరసంగా కనిపిస్తారు. పెద్దవాళ్లకు తొందరగా దాహం వేయదు. కారణం వయసు ప్రభావం వల్ల వీళ్లలో జీవక్రియలు నెమ్మదిగా జరుగుతాయి. ఎవరో ఒకరు నీళ్లు తాగిస్తే తప్ప, మంచం పట్టినవాళ్లు నీళ్లు కావాలని అడగలేరు. అందుకని పిల్లలు, పెద్దవాళ్లు, మంచం పట్టిన వాళ్లను వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఎండాకాలంలో గాలి సరిగా ఆడని, ఇరుకు గదుల్లో ఎక్కువసేపు ఉండొద్దు. చల్లదనం కోసం కూలర్లు వాడాలి. నీళ్లు బాగా తాగాలి. ఆల్కహాల్, కెఫిన్​ ఉన్న డ్రింక్స్ తాగొద్దు. ఎక్కువ తీపి, ఉప్పు ఉన్న ఫుడ్​ తినొద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. కిచెన్​లో వంట చేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్​లో ఉంచితే వేడిగాలి బయటికి పోతుంది. గది టెంపరేచర్​ 28 డిగ్రీల సెల్సియస్​ ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ తగిలే అవకాశాలు తక్కువ..

Read more RELATED
Recommended to you

Exit mobile version