కుంకుపవ్వు వాడటం మంచిదే..కానీ కల్తీదీ వాడితే చాలా ప్రమాదం.. ఇంట్లోనే ఇలా టెస్ట్ చేయండి.!

-

కుంకుమపువ్వు వల్ల ఆరోగ్యానికి లాభాలు చాలానే ఉన్నాయి. అసలే ఈ చలికాలంలో దాల్చినచెక్క, కుంకుమపువ్వు, జాజికాయలను తీసుకుంటే మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటుంటారు. ఎముకల సంబంధిత జబ్బులతోపాటు, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి. కానీ..ఈరోజుల్లో ప్రతీదా కల్తీ చేస్తున్నారు..ఆఖరీకి ఈ మసాలాలు కూడా కల్తీచేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు..ఏది కొందాం అన్నా భయమే..వీటిని అరికట్టే ప్రయత్నం చేయాలంటే..అవి కల్తీ అయ్యాయో లేదో తెలుసుకునే టెక్నిక్స్ మనకు తెలియాలి..మనం ఇప్పటికే..ఆయిల్, కారం, పసుపు ఇలా వంటల్లో వాడేవి కల్తీయా కదా అని ఇంట్లో ఎలా టెస్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాం..ఈరోజు ఖరీదైన కుంకుమపువ్వు కల్తీ అయిందా లేదా అని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం..

ఇంట్లోనే కుంకుమ పూవు కల్తీని పసిగట్టే టెక్నిక్ ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అందించింది. ట్వీటర్ వేదికగా #DetectingFoodAdulterant కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతివారం ఏదో ఒక నిత్యావసరాలపై ప్రజలు ఇంట్లోనే ఎలా కల్తీని పరీక్షించాలో తెలియజేస్తూనే ఉంది. కుంకుమ పూవులో మొక్కజొన్నలో ఉండే తీగల (Maize cob) ద్వారా కల్తీ చేస్తున్నారని FSSAI తెలిపింది.

సైడ్ ఎఫెక్ట్స్..

 

కుంకుమ పూవు ఈ తరహాలో కల్తీ జరిగితే దీనివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట. మొక్కజొన్నల నుంచి వచ్చిన తీగలను మనం తీసుకుంటే కడుపునొప్పి, గ్యాస్, డయేరియా, కడుపు ఉబ్బడం వంటి రోగాల భారిన పడకతప్పదు.. ఇందులో ఫైటిక్ యాసిడ్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మినరల్స్ గ్రహించడాన్ని తగ్గిస్తుంది.

కుంకుమపూవు కల్తీని ఇలా గుర్తిద్దాం..

ఒక గాజు గ్లాసులో 70-80 డిగ్రీల వరకు వేడిచేసిన నీరు తీసుకోండి.
ఇప్పుడు కుంకుమపూవు రెమ్మలు వేయండి
కల్తీలేని కుంకుపూవు మెల్లిగా నీటిలోకి రంగును విడుదల చేస్తుంది.
కల్తీ అయిన సాఫ్రన్ వెంటనే రంగును నీటిలోకి రిలీజ్ చేసేస్తుంది.

కల్తీ అయిన ఆహారం తినటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్, లివర్ డిజార్డర్, కిడ్నీ డిజార్డర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే కల్తీ ఫుడ్ పై కాస్త జాగ్రత్త వహించండి. పిల్లలకు ముఖ్యంగా బయట ఆహారాలు ఎక్కువగా తినిపించొద్దు..వాటి రంగుకు ఆకర్షితులై కావాలని మారం చేస్తారు. వీలైనంత వరకూ బయటఫుడ్స్ ని తగ్గించండి..ఖరీదైనా కల్తీలేని వాటిని తీసుకునేందుకు ట్రే చేయండి. ఇంట్లో గృహిణులు ప్రతీదీ ఎలా టెస్ట్ చేయాలో సోషల్ మీడియా ద్వారా అవగాహన పెంచుకుంటే..మీతో పాటు మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news