కొంతమందికి అసలేం తినాలనిపించదు.. మరికొంత మందికి.. ఇప్పుడే తిన్నా..మళ్లీ గంటకే ఆకలేస్తుంది.. తిన్న వెంటనే ఆకలిగా అనిపించడం మంచి విషయం కాదు..దీన్ని హంగర్ పెగ్స్ అంటారు. కడుపు నిండా తింటే ఇలా జరగదు..మీరు మీ బాడికితగినతం ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు అంటున్నారు. మీకు కూడా ఇలా జరుగుతుంటే.. ఇప్పుడు చెప్పుకోబోయే కొన్నింటిని మీ డైట్‌లో చేర్చుకోండి.. దాని ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు..

మొలకలలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల పదే పదే ఆకలిగా అనిపిస్తే, మీరు మొలకలను తినడం మంచిది. మొలకలు తినడం వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. డైలీ ఉదయం మొలకలు తినే వారికి బరువు అదుపులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొబ్బరి చాలా ఆరోగ్యవంతమైన ఆహారం.. రోజు పచ్చికొబ్బరి తిన్నా ఎలాంటి ప్రమాదం ఉండదు. షుగర్ పేషంట్స్‌కు కొబ్బరి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి ఒక అద్భుతమైన చిరుతిండి.. కొబ్బరిని తీసుకోవడం ద్వారా తరచుగా వేసే ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. దీనితో పాటు ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కొబ్బరిలో రాగి, ఇనుము, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. దీని వల్ల మీకు పదే పదే ఆకలిగా అనిపించదు.

తరచుగా ఆకలి సమస్య నుంచి బయటపడాలంటే బాదంపప్పును తినండి. బాదంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. దీని కారణంగా ఆకలి వేయదు.. పదే పదే తినాలని అనే కోరిక ఉండదు.

మజ్జిగ ఒక ప్రొటీన్ రిచ్ డ్రింక్. మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. మరోవైపు ఆహారం తిన్న తర్వాత మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తే మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
సో.. ఇది మ్యాటర్.. మీకు పదే పదే ఆకలి వేస్తుందని అవి ఇవి తిని ఆరోగ్యం చెడకొట్టుకునే బదులు ఈ సారి ఇవి ట్రే చేయండి.!
– Triveni Buskarowthu