మానసిక ఆరోగ్యం: శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మానసికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి మానసిక ఆరోగ్యంపై చాలామంది దృష్టి పెట్టరు. నిజానికి మానసిక ఆరోగ్యం దెబ్బతింటే కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. బాధగా ఉండడం, యాంగ్జైటీ, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయాలను కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మానసిక సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు. మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించుకోవచ్చు.
మీతో మీరు మంచిగా ఉండండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. మీ పట్ల మీరు దయగా ఉండండి అప్పుడు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ రోజులో కాస్త సమయాన్ని వ్యాయామం కోసం కేటాయిస్తే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
బాగా నిద్రపోవడం వలన కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. చాలా బాగా రాత్రి నిద్రపోరు అలానే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కానీ నిజానికి మంచి నిద్ర మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
రాత్రి నిద్ర పోయే ముందు స్క్రీన్ లని ఆపేస్తే కూడా నిద్ర పడుతుంది. సెల్ ఫోన్, టీవీ వంటి వాటికి రాత్రిపూట దూరంగా ఉంటే కచ్చితంగా మంచి నిద్రని పొందొచ్చు. తద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
శ్వాస మీద ధ్యాస పెట్టి కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
ఇతరులతో కూర్చుని కాసేపు మాట్లాడుకుంటే కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి కాసేపు మీరు ఒక కాగితం మీద మీకు నచ్చిన విషయాలని రాసుకోండి. అప్పుడు కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఒక సపోర్ట్ ని మీరు పొందడం ద్వారా కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
మీ కుటుంబ సభ్యులు లేదంటే మీ స్నేహితులు ఎవరినైనా సరే మీరు సపోర్ట్ గా భావించి వాళ్లతో విషయాలను చెప్పుకుంటే కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది లేదంటే థెరపిస్ట్ ని కన్సల్ట్ చేయండి.
మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే కాస్త బ్రేక్ తీసుకోండి నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయించండి అప్పుడు మానసిక ఆరోగ్యం బాగుంటుంది.