వేసవిలో ఈ పద్ధతులని అనుసరిస్తే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు..!

-

వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి సమయంలో ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలి. ఆరోగ్యం పై దృష్టి పెట్టకపోతే ఎండాకాలంలో డీహైడ్రేషన్, వడదెబ్బ మొదలైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వేసవి కాలంలో ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి..?, ఎలాంటి పద్ధతులుని అనుసరించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా కనుక మీరు అనుసరించారు అంటే వేసవిలో మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా వాటికోసం చూసేద్దాం.

 

ఎక్కువ నీళ్లు తాగడం చాలా అవసరం:

వేసవిలో గొంతు ఆరిపోతూ ఉంటుంది అలాగే ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ లాంటి సమస్యలు వస్తాయి అందుకని హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. మీరు ఒక వాటర్ బాటిల్ ని దగ్గర ఉంచుకుని సమయానుసారం సాగుతూ ఉండండి. మీరు కనుక మర్చిపోతూ ఉంటే అలారం పెట్టుకుని మరీ తాగండి అదేవిధంగా సూప్స్, జ్యూస్లు, కొబ్బరినీళ్లు, నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లు వంటివి తీసుకోండి. పుచ్చకాయ వంటివి దొరుకుతాయి కాబట్టి ఎండాకాలంలో రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల హైడ్రేట్ గా ఉండడానికి అవుతుంది.

కాస్త వ్యాయామానికి సమయం ఇవ్వండి:

ఎండాకాలంలో వేడి, చికాకు వలన చాలా మంది ఒకే దగ్గర ఉండి పోతూ ఉంటారు. దీనివలన అస్సలు వ్యాయామం అవ్వదు. కానీ మీరు కొంచెం డాన్స్, యోగా వంటివి అనుసరిస్తే మంచిది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మీరు కనుక ఎక్కువగా కూర్చుని పని చేస్తూ ఉన్నట్లయితే తిన్న తర్వాత కాసేపు నడవండి ఇలాంటివి చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

పోషక పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి:

వేసవిలో నిజానికి ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండలేము. అలాంటప్పుడు మీరు పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి. దీని వలన ఆరోగ్యం బాగుంటుంది.

మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి:

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మానసిక ఆరోగ్యంపై కూడా కాస్త దృష్టి పెట్టండి.

నిద్రకు సమయం ఇవ్వండి:

బాగా నిద్ర పోవడం వల్ల ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ప్రతిరోజూ మంచిగా నిద్ర పోవడానికి సమయం ఇవ్వండి. అలాగే ఒత్తిడి లేకుండా ఉండేట్టు చూసుకోండి ఇలా ఈ విధంగా వేసవికాలంలో జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా అనారోగ్య సమస్యలు కూడా మీకు కలగవు.

Read more RELATED
Recommended to you

Latest news