జల్ జీరా తో ఎన్నో ప్రయోజనాలు..!

-

వేసవిలో ఎండలు విపరీతంగా ఉంటాయి. అటువంటి సమయం లో చల్లనైన పానీయాలు తీసుకోవడం వల్ల రిఫ్రెష్ గా, రిలీఫ్ గా ఉండొచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది అయిన జల్ జీరా గురించి ఈరోజు మనం చూద్దాం. జల్ జీరా అంటే ఏమీ లేదు. నిజంగా ఇది మంచి డ్రింక్. దీనిని కొత్తిమీర, ఉప్పు, పుదీనా, జీలకర్ర, నల్ల మిరియాలు, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్ మరియు ఎండిన మామిడి తో చేయొచ్చు.

 

కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా జల్ జీరా బాగా పని చేస్తుంది. పైగా మీరు కావాలంటే కొద్దిగా బూందీని కూడా వేసుకోవచ్చు. ఈ ఫేమస్ డ్రింక్ లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే నిజంగా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం..!

బరువు తగ్గడానికి:

బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిలో జీలకర్ర పొడి వేయడం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి పైగా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు క్రమంగా దీనిని తీసుకోండి.

వేడిని తగ్గిస్తుంది:

దీనిలో వివిధ రకాల మసాలాలు వేస్తాం కదా అది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. నిజంగా ఇది వేసవిలో తీసుకోవడానికి కరెక్ట్ ఆప్షన్.

ఇమ్యూనిటీని పెంచుతుంది:

ఎండిన మామిడి పొడి వేయడం వల్ల ఇది మీ ఇమ్మ్యూనిటీని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. పైగా దీని నుంచి విటమిన్ సి కూడా మనకి అందుతుంది.

అజీర్తిని తొలగిస్తుంది:

జల్ జీరా ని తీసుకోవడం వల్ల లోపల ఉండే గ్యాస్ తగ్గుతుంది. పైగా జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. గుండెల్లో మంటని కూడా తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

వికారాన్ని తగ్గిస్తుంది:

ఎప్పుడైనా వికారం లేదా వాంతులు వస్తున్నా జల్ జీరా తీసుకోండి. జల్ జీరా పొడిని వాటర్ లో కలుపుకుని తీసుకోవడం వల్ల వికారం పూర్తిగా తగ్గుతుంది.

పీరియడ్ క్రామ్ప్స్ తగ్గుతాయి:

క్రామ్ప్స్ తో సతమతమయ్యే మహిళలు దీనిని తీసుకోవడం మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల రిఫ్రెష్ గా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news