బ్లాక్ ఫంగస్ తో బాధపడుతుంటే ఇప్పుడు వైట్ ఫంగస్ కూడా . దాని విశేషాలివే..

-

ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఇబ్బందులు పెడుతుంటే మరో పక్క బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ మరింత ఆందోళనకి గురి చేస్తుంది. కరోనా నుండి రికవరీ అయిన వారికి వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి తీవ్రంగా మారుతుంది. కరోనా నుండి రికవరీ అయిన డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు, కరోనా రికవరీలో స్టెరాయిడ్ థెరపీ వాడిన వారికి బ్లాక్ ఫంగస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ వ్యాధిని, అంటువ్యాధుల చట్టం 1897ప్రకారం తీవ్రమైనదిగా గుర్తించింది.

రోజు రోజుకీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అటు రాష్ట్రాలు, ఇటు కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పంపించింది. అదలా ఉంటే తాజాగా వైట్ ఫంగస్ కేసులు వచ్చాయి. పాట్నాలోని మెడికల్ ఆస్పత్రిలో 4వైట్ ఫంగస్ కేసులు వచ్చాయని మైక్రో బయాలజీ హెడ్ ఎస్ ఎన్ సింగ్ తెలిపారు. ఈ 4కేసులు కరోనా లక్షణాలనే కలిగి ఉన్నాయట. కానీ టెస్టులో మాత్రం కరోనా పాజిటివ్ రావట్లేదు. ఇక్కడ వైట్ ఫంగస్ సోకిన వ్యాధిగ్రస్తుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడింది. యాంటీఫంగల్ మందులు ఇవ్వడంతో ఈ వైట్ ఫంగస్ బారి నుండి వారు రికవరీ అయ్యారని తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో సోకుతున్న ఈ రెండు ఫంగల్ వ్యాధులు భారతదేశ ప్రజలని మరింత దిగులుకి గురి చేస్తున్నాయి. ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న కరోనా వ్యాధిగ్రస్తులపై ఎక్కువ ప్రభావం చూపుతున్న ఈ ఫంగల్ వ్యాధుల్లో వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమైంది. ఇది ముందుగా చర్మానికి హాని కలిగిస్తుంది. అలాగే ఆలస్యం చేస్తుంటే మరింత తీవ్రంగా మారి ప్రాణానికే ప్రమాదకరంగా మారవచ్చు. ఈ వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు, చర్మం, గోళ్ళు, కడుపు, కిడ్నీ, మెదడు ఇంకా ఇతర వ్యక్తిగత ప్రదేశాల మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version