మలబద్ధక సమస్యను దూరం చేసే పచ్చి మామిడి..!

-

మామిడిని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా పిలుస్తారు.వేసవిలో వచ్చే పండ్లలో మామిడి చాలా ప్రత్యేకమైనది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మామిడి వలన కలుగుతాయి. వేసవి కాలంలో మాత్రమే వచ్చే పచ్చి మామిడి తినడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. పచ్చిమామిడి కాయకు భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది తినడానికి పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. దీనితో మామిడి కాయ పచ్చడి, పులిహోర, నిల్వఉండే ఊరగాయ… ఇలా అనేక రకములైనా వంటలు చేసుకోవచ్చు.

బరువు తగ్గాలి అనుకునే వారికి పచ్చిమామిడి చక్కగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఏర్పడే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు జీర్ణ శక్తిని మెరుగుపరిచి మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. అలాగే పెద్ద ప్రేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే మీ సమస్యకు పచ్చిమామిడి ఒక చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది.రోజు తినడం ద్వారా అసిడిటీ మరియు కడుపులో మంట వంటి సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఉదర ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

అలాగే పచ్చిమామిడి లివర్ ఆరోగ్యాన్ని పెంచడంలో దోహదపడుతుంది. పచ్చిమామిడిలో ఉండే ఆమ్లాలు లివర్ సమస్యలను తగ్గించడంతోపాటు, అక్కడ ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను రూపుమాపి లివర్ ఆరోగ్యాన్ని పెంచుతుంది.వేసవి ఎండ కారణంగా శరీరం సోడియం, ఐరన్ వంటి ఖనిజాలను కోల్పోతుంది.అందువల్ల ఈ కాలంలో వచ్చే పచ్చి మామిడి లేదా మామిడి జ్యూస్ ని తీసుకోవడం ద్వారా శరీరంలో కోల్పోయిన ఖనిజాలను మళ్ళీ భర్తీ చేస్తుంది.ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి,శరీర వేడిని తగ్గిస్తుంది.

అలాగే పచ్చి మామిడి షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట ఒక వరమని చెప్పవచ్చు. ఈ కాలంలో వచ్చే పచ్చిమామిడిని క్రమం తప్పకుండా తినడం ద్వారా అది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను క్రమబద్ధీకరిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్త కణాలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.పచ్చిమామిడిని నమిలి తినడం ద్వారా దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.అలాగే చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యలకు మామిడి ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తుంది.అలాగే నోటి దుర్వాసన సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news