వయసు పెరుగుతుంటే కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా? మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి.

-

వయసు పెరుగుతున్న కొలదీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. సరైన వ్యాయామం లేకపోతే ఈ సమస్యలు ఇంకా వస్తుంటాయి. అందుకే రోజు ఒక అరగంట కనీసం వ్యాయామం చేయాలి. లేదంటే వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే ఇబ్బందుల వల్ల బాధపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు చాలా ప్రధానమైన సమస్య. వయసు పెరుగుతుంటే ఎముకల్లో కాల్షియం తగ్గడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అందాల్సినవి అందకుండా ఉండడం జరుగుతుంది. దీన్నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ళ నొప్పుల నుండి బయటపడడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం.

గింజలు

వాల్ నట్స్, అవిసె గింజలు, బాదం మొదలగు గింజలని ఆహారంగా తీసుకోవడం వల్ల అందులోని ఒమెగా 3కొవ్వులు శరీరానికి మేలు కలిగిస్తాయి. వీటిని తగిన మోతాదులో తీసుకుంటే కీళ్ళ నొప్పులు కలగకుండా ఉంటుంది.

పండ్లు

పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మన ఎముకలకి బలాన్నిచ్చే పళ్ళలో ముఖ్యంగా బ్లూ బెర్రీస్, ఆపిల్స్ చాలా మంచివి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే పళ్ళు కూడా కీళ్ళ నొప్పులని దూరం చేస్తాయి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్ల మేటరీ ధర్మాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని ఎముకల్ని బలంగా చేస్తాయి. ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.

ఒమెగా 3 కొవ్వులు

అన్ని కొవ్వులు చెడ్డవి అన్న భావన మంచిది కాదు. మనకి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఒమెగా 3కొవ్వులు శరీరానికి చాలా సహకరిస్తాయి. ఇది చేపల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాల్మన్ చేపల్లో అధికంగా ఉంటుంది. అందుకే చేపలని ఆహారంగా తీసుకోవడం చాలా ముఖ్యం. వయసు పెరుగుతుంటే ఆహారంలో మార్పులు మీ జీవనశైలిని ప్రభావితం చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news