పాత వ్యాధే అయినా.. కొత్తగా ఎంట్రీ ఇస్తున్న మంకీపాక్స్.. సోకితే మరణం తప్పదా..!

-

అదేంటో.. మూడేళ్లగా.. ఒక వైరస్ తర్వాత ఇంకో వైరస్ పుట్టుకొస్తున్నాయి. కొత్త పేర్లు..వింత రోగాలు. ఎఫెక్ట్ ఎంత వరకూ ఉంటుందో తెలుసుకునే పనిలో.. వైద్యులు. ఏదైనా వైరస్ కేసులు వస్తున్నాయంటే.. వెంటనే నిపుణులు.. దీని లక్షణాలేంటి, ఎంత స్పీడ్ లో స్ప్రెడ్ అవుతుంది. వస్తే ఎన్నిరోజులు ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లు ఆలోచిస్తున్నారు. హెల్ట్ రిపోర్ట్స్ ఏం వస్తాయో.. దాన్ని బట్టి ఆఫీసులకు పిలవాలా, ఇంకా కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలా అని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఇలా నడుస్తోంది ప్రస్తుతానికి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు మంకీపాక్స్ అనే వైరస్ ఒకటి ఎంట్రీ ఇచ్చింది. దీని కేసులు కూడా పెరుగుతున్నాయట..!

పోర్చుగల్‌లో ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో 14 మందిలో మంకీపాక్స్‌ గుర్తించారు. ఆరుగురు అనుమాన స్థితిలో ఉన్నారు. UKలో 9 మంది, USAలో ఒక్కరిని గుర్తించారు. స్పెయిన్‌లో ఏడుగురు, 40 మంది అనుమానితులుగా ఉన్నారు. కెనడాలో 13 మంది అనుమానితులుగా గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అరుదైన వ్యాధి ఇది.

మంకీపాక్స్ ఇప్పటిదికాదు..

US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) చెప్పేదాని ప్రకారం..1958లో మంకీపాక్స్ మొదటి కేసు నమోదైంది. అప్పట్లో ఈ వ్యాధి కోతులలో కనిపించింది. మశూచి లాంటి వ్యాధి లక్షణాలు కోతులలో కనిపించాయట. కానీ 1970వ సంవత్సరంలో ఆఫ్రికాలో మొదటిసారిగా మనుషులకి మంకీపాక్స్‌ సోకింది. 1970 తరువాత ఆఫ్రికాలోని 11 దేశాలలో మంకీపాక్స్‌ రోగులని నిర్ధారించారు. ఆఫ్రికా నుంచి ఈ వ్యాధి ఇతర దేశాలకు విస్తరించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధిని రోగుల్లో కనుగొన్నారు. 2018 సంవత్సరంలో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్‌లకు సైతం చేరుకుంది. ఇప్పుడు మంకీపాక్స్‌ కేసులు పోర్చుగల్, యుకె, స్పెయిన్, కెనడా, యుకెలలో గుర్తించారు.

మంకీపాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

మంకీపాక్స్ మొదట్లో మీజిల్స్, మశూచి లేదా చికెన్ పాక్స్ లాగా కనిపిస్తుంది. ఇందులో మొటిమలా తయారై శరీరంలోని ఇతర భాగాలకు
కూడా పాకుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు రోగికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, శోషరస గ్రంథులు వాపు, చలి, అలసట, న్యుమోనియా లక్షణాలు, ఫ్లూ లక్షణాలతో బాధపడుతాడు. బాడీ అంతటా దద్దుర్లు లేదా బొబ్బలు వస్తాయి.

మంకీపాక్స్ ఎలా వస్తుంది..?

మంకీపాక్స్ వ్యాధి జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధిని నిపుణులు అంటున్నారు.. కోతులు కాకుండా, ఎలుకలు, ఉడుతల నుంచి కూడా ఈ వ్యాధి వస్తుందట. మంకీపాక్స్ వ్యాధి సోకిన జంతువు రక్తం దాని శరీర చెమట లేదా దాని గాయాలు ఇతర వాటికి తగిలినప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. మంకీపాక్స్ నయం కావడానికి రెండు నుంచి నాలుగు వారాలు పట్టవచ్చు. గాయం గట్టిపడటం వల్ల నొప్పిగా ఉంటుంది.

WHO ప్రకారం మంకీపాక్స్ సోకిన ప్రతి 10వ వ్యక్తి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ఇన్ఫెక్షన్‌కు ఎక్కువగా గురవుతారట. సకాలంలో చికిత్స చేస్తే ఈ వ్యాధి లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాలలో వాటంతట అవే తగ్గుతాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news