కాళ్లవాపు, చర్మసమస్యలు.. బోనస్‌గా నిద్రలేమి..దెబ్బతింటున్న మూత్రపిండాలకు సంకేతాలే..!

-

మనలో ఉండే ప్రతి అవయవం ముఖ్యమైనదే..అయితే మనుషుల్లో ఎలా అయితే కొందరు కాయాకష్టం చేయగలరు. మరికొందరు ఏసీల కింద కీబోర్డులు మాత్రమే నొక్కగలరు.. బయట ఎండ తగిలే చిన్న పని కూడా వాళ్లు చేయలేరు. అలానే మనలో అవయవాలు కూడా.. కొన్నింటిని ఎంత పాడు చేసినా.. మళ్లీ కాస్త మంచి ఫుడ్‌ ఇవగానే లైన్‌లో పడతాయి.. కొన్నింటికి కొంచెం తిక్కరేగినా పని చేయడం మానేస్తాయి.. ఆ తర్వాత మనం ఉండవు. ఇలాంటి సెన్సిటివ్‌ అవయవాల్లో.. గుండె, మెదడు, మూత్రపిండాలు ముందుంటాయి. వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే.. మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అయితే ఇవి దెబ్బతింటున్నాయంటే.. కొన్ని సంకెతాలను ఇస్తాయి.. వాటిని గుర్తెరిగితే గండం నుంచి గట్టెక్కినట్లే..మరి ఆ సంకేతాలు ఏంటో చూద్దామా..! ఎందుకంటే.. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి.. మీరు అస్సలు ఊహించలేరు కూడా.!

బాగా అలసిపోవడం- చిన్నపాటి వ్యాయామం చేసినా శరీరం త్వరగా అలసిపోతుంది. దీనికి కారణం శరీరంలో టాక్సిన్స్ స్థాయి పెరగడం. ఈ పదార్థాలు శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీంతోపాటు రక్తంలో అశుద్ధ పదార్థాల పరిమాణం పెరగడం కూడా ప్రారంభమవుతుంది. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. టాక్సిన్‌ లోడ్‌ బాడీలో ఎక్కువైతే.. అది ఊబకాయానికి కూడా దారితీస్తుంది.

నిద్రలేమి, చర్మ సమస్యలు- నిద్రలేమి, చర్మ సమస్యలు తలెత్తినప్పుడు అలర్ట్ అవ్వాలి. ఈ సమస్యలు మూత్రపిండాల వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని అస్సలు లైట్ తీసుకోవద్దు. లేదంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. చర్మం పొడిబారినట్లు, పొరలు పొరలుగా ఉండి, దురద సమస్యగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కాళ్ల వాపు- కాళ్ల వాపు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులను సూచిస్తుంది. కాళ్లు విపరీతంగా వాచినట్లయితే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే.. కాలం గడుస్తున్నా కొద్ది సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది.

ఈ లక్షణాలు తరచూ మీలో కనిపిస్తున్నాయంటే.. కచ్చితంగా వైద్యులను సంప్రదించండి. కాళ్లు వాపుకు ఆయిల్‌ రాసుకుంటే సరిపోతుంది లే, కాసేపు ఎక్కువ నిద్రపోతే చాల్లే, చర్య సమస్యలకు సోప్‌ మారిస్తే అయిపోతుందిలే అని చాలామంది అనుకుంటారు. కొన్నిసార్లు ఇలాంటి అశ్రద్ధ పెద్దగండంలో పడేస్తుంది. కాబట్టి. సమస్య తరచూ వస్తుంటే..దాన్ని తెరిచి చూడాలి కానీ..దాచే ప్రయత్నంచేయొద్దంటున్నారు నిపుణులు.!

Read more RELATED
Recommended to you

Latest news