గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ ప్రమాద బీమా లబ్దిదారులకు చెక్కులపంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కాంగ్రేస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తొమ్మిది మందికి చెక్కులను పంపిణీ చేసారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 90 రోజుల్లో 45లక్షల సభ్యత్వాలను నమోదు చేయించిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేసారు. 45లక్షల సభ్యులకు రూ.2లక్షల రాజీవ్ గాంధీ ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.
ఇప్పటివరకు 427 మంది సభ్యులు చనిపోయారని.. వీరందరికి ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. 129 మంది ప్రమాద బీమాకు సంబంధించి ధ్రువపత్రాలు సమర్పించారని.. ధ్రువపత్రాలు సమర్పించనివారు వీలైనంత త్వరగా ఆ ప్రాసెస్ పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర పథకం ఆవిష్కరణ, తెలంగాణ జాతీ గీతం ఆవిష్కరణ, గాంధీభవన్ లో జెండా ఆవిష్కరణ చేపడతామన్నారు. అలాగే టీఎస్ ప్లేస్ లో టీజీ మార్పుకి అప్పిల్ చేస్తామన్నారు.