ఆయన విషయంలో చిరంజీవి పెద్ద కూతురుపై ట్రోల్లింగ్..!

-

కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసే మెగాస్టార్ కూతురు సుస్మిత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఎప్పుడు కూడా మీడియాకు దూరంగా ఉండే ఈమె పై ఇటీవల తరచూ ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఆ ట్రోల్స్ వేసేవారు కూడా చిరంజీవి అభిమానులే కావడం గమనార్హం. ఇక అసలు విషయంలోకి వెళ్తే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి అంటే స్టైలింగుకి కేరాఫ్ అడ్రస్ .. ఆయన వేసిన చొక్కాలు.. తొడిగిన ఫ్యాంట్లే అప్పట్లో బాగా ట్రెండ్ సెట్టర్ గా ఉండేవి. ఇక అయితే ఖైదీ నెంబర్ 150 సినిమా వరకు చిరంజీవి స్టైలిష్ లుక్ కొనసాగుతూ వచ్చింది. కానీ ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత సీన్ మొత్తం మారిపోయింది అని చెప్పాలి.

ఇకపోతే ఇందుకు కారణం సుస్మిత నే చెప్పాలి. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి కాస్ట్యూమ్స్, స్టైలింగ్ విభాగంలో కొంతమేర పనిచేసిన సుస్మిత.. సైరా సినిమాకు పూర్తిస్థాయిలో వర్క్ చేసింది. ఈ సినిమాలో ఆయన లుక్కు పై విపరీతమైన కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఆచార్య సినిమా కూడా ఇదే పరిస్థితికి చేరుకుంది.. మెగాస్టార్ చిరంజీవి కూతురు కావడంతో దర్శక నిర్మాతలు కూడా అసహనం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇక దీంతో నెటిజన్స్ ఆమె పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా స్టైల్ విషయంలో కూడా సుస్మిత మీదే విమర్శలు రావడం గమనార్హం.

అంతేకాదు.. మీ నాన్నగారి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే కాస్టమ్స్ అలాగే స్టైలింగ్ విషయములో చిరంజీవి జోలికి వెళ్లొద్దు.. అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా గట్టిగా స్పష్టం చేస్తున్నారు. మరి సుస్మిత ఈ విమర్శనులు పరిగణలోకి తీసుకొని తన తండ్రిని అభిమానులకు తగ్గట్టుగా స్టైలిష్ లుక్ లోకి తీసుకొస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news