హృదయ ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహారపదార్ధాలని తీసుకోండి..!

-

ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం లేదా ఒత్తిడి కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని మరింత బాగా ఉంచుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. వీటిని తీసుకోవడం వల్ల హృదయ ఆరోగ్యం బాగుంటుంది. అయితే మరి ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.

heart health

 

బాదం:

బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని అందరికీ తెలుసు. ఈ నట్స్ ని మీరు తీసుకుంటే హృదయ ఆరోగ్యం బాగుంటుంది. బాదం తినడం వల్ల ఎన్నో లాభాలని పొంది ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోచ్చు. కాబట్టి స్నాక్స్ సమయంలో స్నాక్స్ కి బదులుగా మీరు గుప్పెడు బాదంపప్పుల్ని తినండి. దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది.

చియా సీడ్స్:

చియా సీడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు కావాలంటే చియా సీడ్స్ తో ఏదైనా రెసిపీ తయారు చేసుకొని తీసుకోవచ్చు. హృదయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. అదే విధంగా బరువు తగ్గడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

ఆపిల్:

ఆపిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకుంటుంది. ఆపిల్ తో పాటు మీరు పీనట్ బటర్ కలిపి తీసుకుంటే మరింత బెనిఫిట్స్ పొందవచ్చు. యాపిల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

మ్యూస్లి (muesli) స్మూతీ:

ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పాలతో పాటు మీరు దీనిని తీసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇలా హృదయ ఆరోగ్యంని మీరు పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news