Dehydration: వేసవికాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలో డీహైడ్రేషన్ సమస్య కూడా ఒకటి డిహైడ్రేషన్ వలన ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వేసవి కాలంలో ఎండని వేడిని తట్టుకోవాలంటే సరిపడా మనిషి నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ప్రతి రోజు మంచి నీళ్లు ని తాగుతూ ఉండాలి అప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఉండదు. అయితే డీహైడ్రేషన్ సమస్య వేసవికాలంలో రాకుండా ఉండాలంటే మంచి నీళ్లతో పాటుగా వీటిని కూడా తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన సమస్యలు రావు.
మంచి నీళ్ల తో పాటుగా మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసాన్ని మంచినీళ్ళతో పాటుగా తీసుకుంటే కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. డీహైడ్రేషన్ సమస్య కలగదు. కొంచెం నీళ్లలో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని తీసుకుంటే వేసవి కాలంలో ఎంతో మంచిది. అలానే కీరదోస పుదీనా ని కలిపి మీరు నీళ్లల్లో వేసుకుని తీసుకుంటే కూడా వేసవికాలంలో మేలు కలుగుతుంది.
డీహైడ్రేషన్ సమస్య ఉండదు. బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. నీళ్లలో మీరు చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చు హైడ్రేట్ గా ఉండడానికి అవుతుంది. ఇలా చేయడం వలన ప్రోటీన్ లోపం కూడా మీకు కలగదు. డీహైడ్రేషన్ కూడా ఉండదు నీళ్లలో సోంపు వాము వేసుకున్న కూడా తీసుకోవచ్చు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. వేసేవి లో వడదెబ్బ, గ్యాస్ ఫార్మేషన్ వంటివి కలగకుండా ఇది చేస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేసి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు అలానే ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు.