కర్ణాటకలో గెలిచేది ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్?

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ల మద్య పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అయితే బి‌జే‌పి, కాంగ్రెస్ లకు మాత్రమే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జే‌డి‌ఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటకలో 113 సీట్లు మ్యాజిక్ ఫిగర్..ఆ సీట్లు తెచ్చుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది.

ప్రస్తుతం వస్తున్న మెజారిటీ సర్వేల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నాయి. కొన్ని సర్వేలు బి‌జే‌పికి అనుకూలంగా వస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, బి‌జే‌పిలు మ్యాజిక్ ఫిగర్ దాటలేవని, జే‌డి‌ఎస్ కింగ్ మేకర్ గా ఉంటూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించవచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. అయితే సర్వేలు ఎలా ఉన్నా సరే గెలిచి తీరాలని ఇటు కాంగ్రెస్, అటు బి‌జే‌పిలు గట్టిగా పోరాడుతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుని ప్రచారంలో దూసుకెళుతున్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలని కూడా ప్రకటించేశాయి.

Karnataka Election

అయితే బి‌జే‌పితో పోలిస్తే..కాంగ్రెస్ ఉచితాలని ఎక్కువ ప్రకటించింది. మరి మేనిఫెస్టోల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికైతే కర్ణాటకలో బి‌జేపి-కాంగ్రెస్‌ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలు..పక్కనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. కర్ణాటకలో బి‌జే‌పి గెలిస్తే..ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేనలు..బి‌జే‌పికి మరింత దగ్గరవ్వడానికి చూస్తాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే..బి‌జే‌పితో పొత్తుకు  టి‌డి‌పి-జనసేనలు వెనుకడుగు వేయవచ్చు. వైసీపీ కూడా రహస్య స్నేహాన్ని కొనసాగించే ఛాన్స్ తక్కువ ఉండవచ్చు.

ఇటు తెలంగాణ విషయానికొస్తే..కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే..తెలంగాణలో కాంగ్రెస్‌కు బలం పెరుగుతుంది..బి‌జే‌పి గెలిస్తే..బి‌జే‌పికి కాస్త పట్టు పెరుగుతుంది. చూడాలి మరి కర్ణాటక ఫలితాలు ఎలా వస్తాయో.

Read more RELATED
Recommended to you

Latest news