కోప్పడి బీపీ తెచ్చుకునే బదులు తగ్గించుకుని హ్యాపీ తెచ్చుకుంటే పోలా? కోపాన్ని నియంత్రించడానికి చిట్కాలు..

-

కోపం… అనుకున్నది జరగలేదని, అర్థం చేసుకోవట్లేదని, పట్టించుకోవట్లేదని, ఆటపట్టిస్తున్నారని, ఆజమాయిషీ చలాయించాలని ఇలా రకరకాలుగా కోపాన్ని తెచ్చుకుంటారు. మీరెన్ని రకాలుగా కోపం తెచ్చుకున్న దానివల్ల అవతలి వారికి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. పోయేదంతా మీకే. కోపం వల్ల వచ్చిన అసహనంతో ఆరోగ్యం చెడిపోయి అతలాకుతలం అయిపోతారు. అందుకే కోపాన్ని తగ్గించుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ కోపాన్ని తగ్గించుకునే కొన్ని చిట్కాలని అందిస్తున్నాం. ఒక్కసారి చూడండి.

గాఢంగా ఊపిరి పీల్చుకోండి.

కోపం వల్ల కండరాలు బిగుతుగా మారిపోతాయి. అప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. అది కండరాలను శాంతపరుస్తుంది. దానివల్ల కోపం నియంత్రణలో ఉంటుంది.

నడక

కోపం ఎక్కువవుతుందని మీరు అనుకున్నప్పుడు నడక మీ ఆలోచనని మారుస్తుంది. వాకింగ్ చేయడం వల్ల కోపం తగ్గుతుంది. ఆలోచన దాని మీద నుండి మారి మరోదానికి మరలుతుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించడానికి వాకింగ్ చేయండి.

మీతో మీరు మాట్లాడండి

ఏదైనా కాని పని జరిగినపుడే కోపం వస్తుంది. కాబట్టి ఏది జరిగినా మన మంచికే అనుకోవడమే మంచిది. ఆత్రేయ గారు రాసిన అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అనే మాట గుర్తుంచుకోండి. అలా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ఉంటే కోపం తగ్గుతుంది. దానివల్ల వచ్చే సమస్యలూ తగ్గుతాయి.

ఒంటరిగా ఉండండి.

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. కోపం తగ్గాలంటే కొందరు ఒంటరిగా ఉండాలనుకుంటారు. కానీ కొందరు నలుగురిలో తిరగాలి అనుకుంటారు. మీకెలా ఉంటుందో ఆలోచించుకుని ఆ పద్దతి అవలంబిస్తే బెటర్.

రాయడం నేర్చుకోండి

ఇది బాగా పనిచేస్తుంది. మీ కోపానికి కారణాలు, దానివల్ల కలిగే నష్టాలు, అవి జరగడం వల్ల మీకొచ్చే ఇబ్బందులు ఏంటని రాసుకోండి. ఒక రెండు మూడు సార్లు రాస్తుంటే మీ కోపం పూర్తిగా తగ్గిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version