చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలన్న అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలన్నా ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇది నిజంగా వింటర్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. వీటిని తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి. పైగా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవుతుంది.
ఉల్లికాడలు:
ఉల్లికాడలు చలికాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది క్యాన్సర్ ని నయం చేసే గుణం కూడా ఇందులో ఉంది. అలానే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
కమలాలు:
కమలాలను తీసుకోవడం వలన కూడా ఆరోగ్యం బాగుంటుంది వింటర్లో ఇవి మనకి బాగా దొరుకుతాయి కూడా. కమల పండ్లను తినడం వలన గుండె జబ్బులు టైప్ టు డయాబెటిస్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు.
ఎర్రముల్లంగి:
ఎర్ర ముల్లంగి కూడా చలికాలంలో దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు.
దానిమ్మ:
దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ సమస్య రాకుండా చూస్తుంది. హార్ట్ కి సంబంధించి సమస్యలు కూడా ఉండవు.
ఎర్ర క్యాబేజీ:
ఎర్ర క్యాబేజీ కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది దీనిని తీసుకోవడం వలన కూడా చలికాలంలో అనారోగ్య సమస్యలు వుండవు.
పుట్టగొడుగులు:
చలికాలంలో పుట్టగొడుగులని సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు క్యాన్సర్ ప్రమాదం నుండి ఇవి బయట పడేస్తాయి. విటమిన్ డి కూడా ఇందులో ఉంటుంది.
బీట్రూట్:
బీట్రూట్ ని అసలు తినడం మర్చిపోకండి ఇందులో ఐరన్ మొదలైనవి ఉంటాయి. బీపీని అదుపులో ఉంచుతాయి అలానే ఇతర ప్రయోజనాలు కూడా బీట్రూట్ ద్వారా పొందవచ్చు.
క్యాలీఫ్లవర్:
ఇందులో కూడా చక్కటి పోషకాలు ఉన్నాయి క్యాలీఫ్లవర్ ని మీరు చలికాలం తీసుకుంటే చాలా సమస్యల నుండి బయట పడొచ్చు. అలానే మీరు చలికాలంలో క్యారెట్లు చిలకడదుంపల్ని కూడా తీసుకుంటూ ఉండండి ఇవి కూడా ఆరోగ్యానికి మంచిదే.