చలికాలంలో ఉసిరిని తీసుకుంటే ఈ సమస్యలు వుండవు..!

శీతాకాలంలో చలిని ఎదుర్కోవడంతో పాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో లభించే ఆహారపదార్ధాలలో ఉసిరికాయ ఒకటి. ఉసిరికాయను శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు మనం పొందవచ్చు. ఉసిరికాయలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది దానితో పాటుగా ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.అయితే ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం.

 

రోగనిరోధక శక్తిని పెంచుకోచ్చు:

ఉసిరికాయను తీసుకోవడం వల్ల శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పొందవచ్చు. ఉసిరికాయను ఉపయోగించి తయారుచేసిన చ్యవన్ ప్రాశ్ ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి లభిస్తుంది. తరచుగా శీతాకాలంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, దగ్గు, జ్వరం వంటివి దరిచేరకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటిని ఎదుర్కొనే విధంగా శరీరం బలంగా మారుతుంది.

కాన్స్టిపేషన్ తగ్గుతుంది :

శీతాకాలంలో వచ్చే సమస్యల్లో కాన్స్టిపేషన్ ఒక సహజమైన సమస్య. ఉసిరికాయలు తినడం వల్ల స్టమక్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ ప్రక్రియకు సంబంధించిన ఎటువంటి వ్యాధులైన తగ్గుతాయి.

హెయిర్ లాస్ ఉండదు:

ఈ కాలంలో ఎంతోమందికి ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఉసిరికాయలో ఉండే పోషక గుణాలు వలన జుట్టు చాలా బలపడుతుంది. దాంతో ఈ సమస్య తగ్గుతుంది.

ఉసిరి కాయలను ఏ విధంగా తీసుకోవచ్చు…?

ఒక స్పూన్ ఉసిరి పొడి, తేనెను వేడినీళ్లలో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. దాంతో ఎటువంటి వ్యాధులు నుండి అయినా మీరు కాపాడుకోవచ్చు. ఉసిరి జ్యూస్ ను కూడా తీసుకోవచ్చు, ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ ఉసిరి జ్యూస్ ను వేసుకుని తాగొచ్చు. ఉసిరికాయ పచ్చడి లేదా మురబ్బా కూడా తినవచ్చు. ఉసిరికాయలు ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యప్రయోజనాలను మీరు పొందవచ్చు.