పాలు తాగిన తర్వాత, పాలు తాగే ముందు ఈ తప్పులు చేయొద్దు..!

-

చాలా మంది రెగ్యులర్ గా పాలు తాగుతూ ఉంటారు. అయితే పాలు(milk) తాగే ముందు కానీ పాలు తాగిన తర్వాత కానీ ఈ తప్పులు చేశారంటే ఇబ్బందులు తప్పవు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏ సమయంలో పాలు తాగితే మంచిది అని తెలుసు. కానీ ముందు, వెనక ఏమి తినొచ్చు ఏమి తినకూడదు అనేది తెలియదు.

పాలతో పాటు కొన్ని ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకూడదు అని నిపుణులు అంటున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే..? పాలల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి.కాబట్టి అటువంటి సమయంలో మరే ఇతర ఆహార పదార్థాల తీసుకున్నా ప్రమాదం కాబట్టి పాలు తాగడానికి ముందు పాలు తాగిన తర్వాత ఈ ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకండి.

సాధారణంగా మనం పాలతో పెరుగు చేస్తాము దానిని కూడా అస్సలు మనం పాలతో పాటు తీసుకోకూడదు. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎంతో ప్రమాదం.
అలాగే నిమ్మరసం, పనసకాయ, కాకరకాయ లేదా ఉప్పు పాలతో తీసుకోకూడదు. వీటిని కనుక మీరు మర్చిపోయి తీసుకున్నా ఎంతో ఇబ్బంది వస్తుంది. చర్మ సమస్యలు రిస్కు కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తీసుకుంటే దురదలు, సోరియాసిస్ మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
అలానే పాలతో పాటు పెసరపప్పు, మినప్పప్పు కూడా తీసుకోకూడదని.. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.
అదేవిధంగా క్యారెట్లు, చిలకడ దుంపలు, బంగాళదుంపలు, నూనె, బెల్లం, తేనే, పెరుగు, కొబ్బరి, వెల్లుల్లి మరియు ఉప్పటి పదార్థాలు, అసిడిక్ సుబ్స్టెన్సుస్ వంటి వాటిని పాలు తీసుకున్న రెండు గంటల వరకు అస్సలు తీసుకోకూడదు.
మినప్పప్పు తో పాటు పాలు తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తప్పులు కనుక చేశారు అంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి పాలు తీసుకునే ముందు మరియు తీసుకున్న తర్వాత కూడా ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news