కళ్ళు పొడిబారుతున్నాయా..? ఈ టిప్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి

-

ఈ రోజుల్లో పని మొత్తం కంప్యూటర్లలో, ఫోన్లో జరిగిపోతోంది. స్క్రీన్ టైం ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కళ్ళల్లోనే ద్రవాలు ఎండిపోతున్నాయి. ఈ కారణంగా చిరాకు, కళ్ళు ఎర్రబడటం, కొన్నిసార్లు సరిగ్గా కనిపించకపోవడం జరుగుతుంది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించడం మంచిది. అలా కాకుండా నార్మల్ గా ఉన్నట్లయితే కళ్ళు పొడిబారటాన్ని కొన్ని ఇంటి చిట్కాలు తగ్గిస్తాయి.

20-20-20 రూల్:

ఎక్కువసేపు కంప్యూటర్లను, ఫోన్లను వాడుతున్నట్లయితే ఈ నియమాన్ని తప్పకుండా పాటించండి. 20 నిమిషాల పాటు కంప్యూటర్ ను వాడితే 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువును చూసి కళ్ళను మిటకరించాలి. ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

దోసకాయ ముక్కలు:

దోసకాయ ముక్కలను గుండ్రంగా కత్తిరించి రెండు కళ్ళ మీద రెండింటిని పెట్టుకోవాలి. ఇలా పది నుండి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. కళ్ళు పొడిబారటం తగ్గుతుంది.

డైట్:

మీ కళ్ళు పొడిబారకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కలిగిన చేపలను మీ డైట్ లో భాగం చేసుకోవాలి. అవిసె గింజలు, వాల్ నట్స్ వంటి వాటిని డైట్ లో చేర్చుకోండి.

వేడి నీటితో కాపడం:

ఈ చిట్కా కూడా కళ్ళు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో శుభ్రమైన బట్టను ముంచి కళ్ళు మూసుకుని ఐదు నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకోండి. ఒక రోజులో రెండు నుంచి మూడుసార్లు ఈ ప్రాసెస్ ని చేయండి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version