డయాబెటీస్ తో బాధ పడే వారికి ఈ ఆహారపదార్ధాలు మంచివి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లు రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం, తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ ఆహార పదార్ధాల గురించి చూసేయండి.

ఓట్స్:

డయాబెటిస్ తో బాధపడే వారికి ఓట్స్ చాలా మంచిది. ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వాళ్లు రెగ్యులర్ గా ఓట్స్ ని తీసుకుంటూ ఉండండి. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పాలకూర జ్యూస్:

పాలకూర జ్యూస్ కూడా డయాబెటిస్ తో బాధపడే వారికి చాలా మంచి ఆహార పదార్ధము. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ లెవల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఉడికించిన గుడ్లు:

డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఉడికించిన గుడ్లను డైట్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి వీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

పండ్లు:

ఆపిల్, స్ట్రాబెర్రీస్, కివి వంటి పండ్లు డయాబెటిస్ తో బాధపడే వాళ్లకి చాలా మంచిది. ఉదయాన్నే వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీ వస్తుంది. అలానే ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

గింజలు మరియు నట్స్:

నట్స్ మరియు గింజలు తీసుకోవడం కూడా వీళ్ళకి ప్లస్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి గింజలను మరియు నట్స్ ని కూడా ఎక్కువగా డైట్ లో తీసుకుంటూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news