ప్రకృతి మనకు దేవుడిచ్చిన వరమని చెప్పవచ్చు. ఇక ప్రకృతిలో లభించే ప్రతి మొక్క కూడా మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రకృతిలో లభించే ప్రతి మొక్క యొక్క ఆకులు, వేర్లు, పువ్వులు, కాయలు, కాండం ఇలా ప్రతి ఒక్క భాగం కూడా మానవ జీవితంలో ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.. అలాంటి వాటిలో వావిలాకు కూడా ఒకటి. దీనినే ఇంగ్లీషులో నిర్గుండి అని కూడా పిలుస్తూ ఉంటారు. రోడ్డుకిరువైపులా.. పొలాల గట్ల పైన.. మనం ఈ మొక్కలను విరివిగా చూడవచ్చు. ఇకపోతే ఈ మొక్క యొక్క ఉపయోగాలు కూడా ఇప్పుడు ఒక సారి చదివి తెలుసుకుందాం.
బిడ్డ జన్మించిన తర్వాత బాలింతలకు స్నానం చేయించే నీటిలో వీటి ఆకులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటి ఆకులలో ఉండే మెడికల్ గుణాల వల్ల బాలింతల శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా బలంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా బాలింతలకు శరీరం నీటి శాతం తో అధికంగా నిండి ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఈ ఆకులు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం దృఢంగా మారి శరీరంపై పేరుకుపోయిన ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ను నాశనం చేస్తాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా ఈ ఆకులను నీటిలో మరిగించి నొప్పి ఉన్నచోట ఆ నీటితో కడగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
అంతే కాదు ఎవరైనా సరే ఉబ్బసం, కండరాల నొప్పులు, వివిధ రకాల ఆందోళనలతో బాధపడుతున్నట్లయితే ఈ ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇది ఒక శక్తివంతమైన ఆయుర్వేద మొక్క అని చెప్పవచ్చు. ఇకపోతే గుర్తించదగిన చికిత్స లక్షణాలను ఈ మొక్క కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మొక్క ఉపయోగించి ఎన్నో రకాల జబ్బులను దూరం చేసుకోవచ్చు.