లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే… వీటిని తప్పక ఫాలో అవ్వండి..!

-

లివర్ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం కూడా చాలా ముఖ్యం. చాలా మంది రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు ఈ తప్పులు వలన ఆరోగ్యం పాడవుతుంది అని గుర్తుంచుకోవాలి. మనకి ఉండే ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. లివర్ చాలా పనులని పూర్తి చేస్తుంది అవి జరగబట్టే మన ఆరోగ్యం బాగా ఉంది. అయితే లివర్ ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా వీటిని గుర్తు పెట్టుకొని ఆచరించాలి అప్పుడే లివర్ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది బరువు విషయంలో శ్రద్ధ తీసుకోరు కానీ నిజానికి అధిక బరువు సమస్య వలన లివర్ సమస్యలు వస్తాయి కాబట్టి బరువుని కంట్రోల్ లో ఉంచుకోండి.

బ్యాలెన్స్డ్ ఫుడ్ ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం చాలా మంది సరైన ఆహారాన్ని డైట్లో చేర్చుకోరు. నిజానికి బ్యాలెన్స్డ్ ఫుడ్ ని తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్ ఆరోగ్యం కోసం కచ్చితంగా ఫైబర్ ప్రోటీన్ మొదలైన ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకోండి అప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. లివర్ ఆరోగ్యం బాగుండాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది ఆల్కహాల్ ని అధికంగా తీసుకోవడం వలన కూడా లివర్ దెబ్బతింటుంది. కాబట్టి ఆల్కహాల్ ని లిమిట్ గా తీసుకోండి ఎక్కువ తీసుకుంటే ప్రమాదం కలుగుతుంది.

ఒకరు ఉపయోగించే రేజర్లు, టూత్ బ్రష్లు, నెయిల్ క్లిప్పర్స్ వంటివి ఇంకొకళ్ళు ఉపయోగించకూడదు అలానే శృంగార సమయంలో చాలామంది ప్రొటెక్షన్ లేకుండా వివిధ వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటారు దాంతో హెపటైట్ బి రిస్క్ ఎక్కువ ఉంటుంది హెపటైటిస్ సి ప్రమాదం కూడా ఉంటుంది. పిల్లలకి డైపర్ మార్చిన తర్వాత చేతులు కడుక్కోవడం బాత్రూం కి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం ఆహారం తయారు చేసే ముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కుని తయారు చేయడం వంటివి కచ్చితంగా అనుసరించాలి చిన్న చిన్న పొరపాట్ల వలన కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తప్పులను చేయకుండా చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version