ఆవిలిస్తే కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి.. ఒక మనిషి జీవితకాలంలో ఎన్నిసార్లు ఆవిలిస్తారో తెలుసా..?

-

నిద్రవస్తున్నా..మనం ఏదో ఒక పనిలో ఉండి నిద్రపోకుండా అలానే వర్క్ చేసేప్పుడు తెగ ఆవలింతలు వస్తాయి కదా.. పైగా మనకు ఆవలింతలు వస్తే.. పక్కన వాళ్లకు కూడా వచ్చేస్తాయి. అయితే మీరు గమనించారో లేదో.. ఆవలిస్తున్నప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి.. అసలా అలా ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? మన శరీరంలో జరిగే ప్రతిచర్యకు ఒక కారణం ఉంటుంది. మరి ఇలా నీళ్లు రావడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా..?
మన కనుబొమ్మల దిగువన లాక్రిమల్ గ్రంథులు ఉంటాయి. ఇవి మన కళ్లు ఉత్పత్తి చేసే కన్నీళ్లకు కారణమవుతాయట. ఈ గ్రంధులు రోజంతా నెమ్మదిగా నీటిని ఉత్పత్తి చేస్తుంటాయి. ఎందుకంటే కళ్లు పొడి బారకూడదు. ఎప్పుడు తేమవంతంగా ఉండాలి. అయితే ఆవలించినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు గ్రంధుల నుంచి విడుదలై కళ్లల్లో చేరుతుంది. మీరు ఆవలించినప్పుడు మీ ముఖ కండరాలు సంకోచిస్తాయి. ఆ సమయంలో కన్నీటి గ్రంధులపై ఒత్తిడి పడుతుంది. ఇలా ఒత్తిడి వల్ల గ్రంధులను పిండినట్టు అవుతుంది. అప్పుడు అందులోని ఎక్కువ నీరు కళ్లల్లోకి చేరుకుంటాయి. అందుకే ఆవలించినప్పుడు కళ్లలోకి వస్తుంది.
ఆవలింత ఒక అంటువ్యాధి అని. ఒకరు ఆవలిస్తే పక్కనున్న వారికి కూడా ఆవలింతలు వచ్చేస్తాయి. భలే ఫన్నీగా ఉంటుంది కదా.. ఒకరు పడుకుంటే మాత్రం పక్కన వాళ్లకు నిద్రరాదు.. మనంతట మనకు పడుకోవాలనిపించి నిద్రవస్తేనే వస్తాయి.. మన ఆవలించడం ఇప్పుడు కాదు తల్లి గర్భంలోనే మొదలుపెట్టేశాం. ఒక వ్యక్తి జీవితకాలంలో రెండు లక్షల 40 వేల సార్లు ఆవలిస్తాడని అంచనా.
అసలు ఆవిలింతలు ఎందుకు వస్తాయి..
మనం బాగా అలసిపోయినప్పుడు మెదుడలోని ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు మనం చల్లటి గాలిని కోరుకుంటాం. చల్లటి గాలిని పీల్చినప్పుడు మెదడు చల్లబడుతుంది. ఉత్తేజాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో మెదడు అప్రమత్తంగా మారుతుంది. ఆవిలింతల ద్వారా తన ఉష్ణోగ్రతను, అలసటను బయటికి పంపిస్తుందట..మనుషలే కాదు, జంతువులు కూడా ఆవిలిస్తాయి తెలుసా..? కావాలంటే ఈసారి గమనించండి.!

Read more RELATED
Recommended to you

Latest news