షుగర్‌ ఉన్నవారికి స్ట్రోక్ ఎందుకు వస్తుంది..?

-

ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో డయాబెటిస్ తో బాధ పడుతున్నారు. డయాబెటిస్ వలన చాలా మంది రకరకాల సమస్యలకు గురవుతున్నారు. ఏదేమైనా డయాబెటిస్ ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. లేక పోతే లేని పోని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ తో బాధపడే వాళ్ళు రకరకాల చిట్కాలు ని కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే షుగర్ ఉన్న వాళ్ళలో స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్ట్రోక్ కి షుగర్ కి సంబంధం ఏమిటి..?

షుగర్ ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది. అంతేకాదు స్ట్రోక్ తర్వాత వచ్చే సమస్యలు కూడా ఎంతో ఇబ్బందికరంగా మారుతాయి. ముఖ్యంగా షుగర్ లేని వాళ్ల కంటే కూడా ఉన్న వారిలో స్ట్రోక్ సమస్య పెద్దగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. డయాబెటిస్ ఇస్కిమిక్స్ స్ట్రోక్ కి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రక్తంలో చక్కెర శాతం ఎక్కువ ఉండడం వలన రక్తనాళాలు గట్టి పడతాయి. ఇలా కొనసాగినప్పుడు రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయి గడ్డ కడతాయి దీంతో బ్రెయిన్ లాంటి ముఖ్య అవయవాలకి రక్తం సరఫరా కష్టమవుతుంది.

స్ట్రోక్ వస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. డయాబెటిస్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు సరిగ్గా కనబడక పోయినా నీరసం, అలసట వంటివి రాకుండా జాగ్రత్త పడండి. వైద్యుల సలహా తీసుకోండి. ఒకసారి స్ట్రోక్ వచ్చింది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి. అధిక బరువు, హై బీపీ, ప్రీ డయాబెటిస్, పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం, హై బీపీ వలన స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని అనుసరించడం, వర్కౌట్స్ చేయడం, అధిక బరువును తగ్గించుకోవడం, బ్లడ్ లో గ్లూకోస్ లెవెల్స్ ని చెక్ చేయించుకుంటూ ఉండటం, రెగ్యులర్ గా డాక్టర్ నీ కన్సల్ చేయడం వంటివి తప్పక పాటించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version